Home > జాతీయం > మా మనోభావాలు దెబ్బతిన్నై.. ఆదిపురుష్ను బ్యాన్ చేయండి’.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

మా మనోభావాలు దెబ్బతిన్నై.. ఆదిపురుష్ను బ్యాన్ చేయండి’.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

మా మనోభావాలు దెబ్బతిన్నై.. ఆదిపురుష్ను బ్యాన్ చేయండి’.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
X

మహాకావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆదిపపురుష్. ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్, కృతి ససన్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా.. ఇవాళ (జూన్ 16) ప్రపంచ వ్యప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. మిక్స్ట్ టాక్, ట్రోల్స్ మధ్య ప్రస్తుతం థియేటర్లన్నీ హౌజ్ ఫుల్ బోర్డ్ పెట్టుకుని కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆదిపురుష్ సినిమాపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని.. హిందు సేన నేత విష్ణు గుప్తా పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ సినిమా రాముడిని, రామాయణాన్ని అపహాస్యం చేసేలా ఉందని హిందూ సేన ఆరోపించింది. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడికి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. హిందువుల దృష్టిలో రాముడు, సీతా పాత్రలకు ప్రత్యేక స్థానం ఉందని.. వాళ్ల పవిత్ర రూపాలను సినిమా నిర్మాతలు, దర్శకులు, నటులు మార్చారని పిటిషన్ లో తెలిపారు. వాటిని సవరించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని.. దానికి పాల్పడ్డ చిత్ర బృదంపై చర్యలు తీసుకోవాలని కోరారు. హిందూ నాగరికతను అవమాన పరిచేలా ఉన్న ఈ సినిమాను బ్యాన్ చేయాలని కోరారు.

Updated : 16 Jun 2023 8:24 PM IST
Tags:    
Next Story
Share it
Top