50 ఏళ్ల వయసులో తండ్రైన పంజాబ్ సీఎం
X
పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రైయ్యారు. అతడి భార్య డా.గురుప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా మాన్‌కు గతంలో ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. తర్వాత 2022లో సీఎం మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు.‘భగవంతుడు కూతురిని ప్రసాదించాడు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు’ అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
లూథియానాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురుప్రీత్‌కు ప్రసవం జరిగినట్లు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు భగవంత్ మాన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో భగవంత్ మాన్ తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రకటించారు. లూథియానాలో జరిగిన సభలో ప్రసంగిస్తూ.. తన భార్య గురుప్రీత్ ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి అని.. మార్చిలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.