ఆ యూనివర్సిటీల్లో హోలీ వేడుకలు బ్యాన్.. విద్యార్థులకు ఆ దేశం హెచ్చరిక
X
పాకిస్థాన్ ఉన్నత విద్యా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి స్టూడెంట్ హోలీ పండుగను జరుపుకున్న వీడియోలు బయటికి విడుదలైన కొద్ది రోజుల్లోనే.. అన్ని విద్యా సంస్థలలో హోలీ వేడుకలను నిషేధించింది. ‘ఇలాంటి కార్యకలాపాలు దేశ సామాజిక, సాంస్కృతిక విలువలకు పూర్తిగా విఘాతం కలిగిస్తాయి. దేశంలోని ఇస్లామిక్ గుర్తింపును క్షీణింపజేస్తాయ’నే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా కమిషన్ తెలిపింది.
జూన్ 12న ఇస్లామాబాద్ లోని క్వాయిడ్ ఐ అజం యూనివర్సిటీ స్టూడెంట్స్.. క్యాంపస్ లో హోలీ వేడుకను జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే హెచ్ఈసీ హోలీ వేడుకలు నిషేదిస్తూ ఆర్డర్ పాస్ చేసింది. విద్యార్థులు.. సామాజిక సాంస్కృతిక విలువలకు కట్టుబడి ఉండేందుకు ఈ వేడుకను బ్యాన్ చేసినట్లు కమిషన్ నోటీసులో తెలిపింది.
Holi celebrations Quaid-i-Azam University Islamabad 🖤 🥀#QAU_ISLAMABAD #holi #holi2023 pic.twitter.com/CHVkY5NL1m
— QAU News (@NewsQau) June 19, 2023