Amit Shah : అమిత్ షా ప్రచార షెడ్యూల్లో మార్పు.. శనివారం మేనిఫెస్టో రిలీజ్..
X
బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో స్వల్ప మార్పు జరిగింది. ఈ నెల ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. ఒక రోజు వాయిదా పడింది. అమిత్ షా 17న ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా.. బిజీ షెడ్యూల్ కారణంగా ఆ రోజు రాత్రికి హైదరాబాద్ రానున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.30గంటలకు బేగంపేటలోని ఐటీసీ కాకతీయకు చేరుకోనున్న అమిత్ షా రాత్రికి అక్కడే బస చేస్తారు.
శనివారం ఉదయం 10:30 గంటలకు అమిత్ షా కత్రియా హోటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం షా బేగంపేట నుంచి హెలికాప్టర్లో గద్వాల్కు వెళ్తారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.20 గంటల వరకు గద్వాల సభలో పాల్గొంటారు. అనంతరం నల్గొండ, వరంగల్, రాజేంద్రనగర్ సభల్లో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి.