Home > జాతీయం > భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
X

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకు సమాన హక్కు ఉంటుందని తెలిపింది. భర్త ఆస్తి సంపాదించడంలో భార్య సమానంగా సహకరిస్తుందని.. గృహిణిగా ఆమె కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వల్లే భర్త బయట స్వేచ్ఛగా పనిచేయడానికి వీలవుతోందని వ్యాఖ్యానించింది. భార్య సహకారం లేకుండా ఏ భర్త డబ్బు సంపాదించడం లేదా ఉద్యోగం చేయడం వంటివి చేయలేడని జస్టిస్ కృష్ణన్ రామసామి అన్నారు.

‘‘కుటుంబ ఆస్తులు భర్త సంపాదించడం వెనుక భార్య పరోక్ష భాగస్వామ్యం ఉంది. ఈ విషయాన్ని ఈ న్యాయస్థానం గుర్తిస్తోంది. దశాబ్దాల పాటు కుటుంబాన్ని, పిల్లలను భార్య ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. చివరకు ఆమెకు తన సొంతమని చెప్పుకోవడానికి ఏమి మిగలదు. కుటుంబ సంక్షేమం కోసం ఆస్తుల సంపాదనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భార్యాభర్తలిద్దరి భాగస్వామ్యం ఉంటుంది. ఇద్దరికీ ఇందులో సమాన వాటా ఉంటుంది’’ అని జస్టిస్‌ రామసామి స్పష్టం చేశారు.



తమిళనాడుకు చెందిన ఓ జంటకు 1965లో పెళ్లి అయ్యింది. వారిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2002లో భర్త కన్నయన్ నాయుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు.. అతడు పంపించే డబ్బుతో భార్య ఆమె పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో అతడు తన భార్య పేరు మీద ఉన్న ఆస్తులు తన పేరు మీదకు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరాడు. అయితే ఆ ఆస్తిపై ఇద్దరికీ సమాన హక్కు ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.


Updated : 26 Jun 2023 9:40 AM IST
Tags:    
Next Story
Share it
Top