Home > జాతీయం > తాగిన మత్తులో ఆస్పత్రి సిబ్బంది హల్ చల్.. పేషెంట్ వార్డ్‌లోనే..

తాగిన మత్తులో ఆస్పత్రి సిబ్బంది హల్ చల్.. పేషెంట్ వార్డ్‌లోనే..

మహబూబూబాద్ జిల్లా హాస్పిటల్ లో దారుణం జరిగింది. మద్యం తాగిన మత్తులో హల్చల్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. ఓ పక్క పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తుండగానే... వారి కళ్ల ముందే, ఆ హాల్‌లోనే డస్ట్ బిన్ లో మూత్రం పోశాడు ఓ చంఢాలుడు. యాక్సిడెంట్ అయిన బాధితులకు ఓ పక్క కట్లు కడుతున్నారు. పీకల వరకు తాగారో ఏమో.. ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో అనేది తెలియకుండానో లేదంటే అడిగే వారు ఎవరూ లేరనో .. ఆ రూమ్ వార్డులోనే చెత్త డబ్బాలో మూత్రం పోశారు. ఒకడు మూత్రం పోస్తుంటే మరొకడు వీడియో తీశారు. మమ్మల్ని ఎవరు ఏమి అనలేరని అహంతో.. వీడియోలకు ఫోజులిచ్చి మరీ నానా హంగామా చేశారు. దీంతో అక్కడున్న పేషెంట్లు, అటెండెంట్లు భయాందోళనకు గురయ్యారు.

సాయి ఏజెన్సీ ద్వార రిక్రూట్ మెంట్ అయిన ఆ ఇద్దరు సిబ్బందిపై పలు అరోపణలు వచ్చాయి. యాక్సిడెంట్ అయిన పేషెంట్లకు M. N. 0 చేయాల్సిన పనులను.. స్ట్రెచర్ వర్క్ స్టాఫ్ తో చేయిస్తుంది ఆస్పత్రి వర్గం. మరోవైపు మద్యం మత్తులో ఉన్న ఆ సిబ్బందిపై.. ఆస్పత్రి పేషేంట్లు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై చాలాసార్లు ఫిర్యాదులు చేసినా.. ఇంత జరుగుతున్న జిల్లా సూపరిడెంట్ పట్టించుకోవడంలేదని పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఆస్పత్రిలో హంగామా వీడియో వాట్సాప్ లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు.. వారిపై యాక్షన్ తీసుకుంటారా.. లేదంటే మాములే అని వదిలేస్తారా..? అనేది చూడాలి.




Updated : 2 July 2023 11:34 AM IST
Tags:    
Next Story
Share it
Top