Home > జాతీయం > మీరు హాస్టల్లో ఉంటున్నారా.. అయితే జీఎస్టీ కట్టాల్సిందే..

మీరు హాస్టల్లో ఉంటున్నారా.. అయితే జీఎస్టీ కట్టాల్సిందే..

మీరు హాస్టల్లో ఉంటున్నారా.. అయితే జీఎస్టీ కట్టాల్సిందే..
X

హాస్టల్స్లో ఉండేవారికి ఇది బ్యాడ్ న్యూస్. హాస్టల్ అమౌంట్ మరింత పెరగే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం హాస్టల్ వసతిపై 12శాతం జీఎస్టీ వర్తిస్తుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ స్పష్టం చేసింది. పేయింగ్ గెస్ట్, హాస్టళ్లు గృహ వసతి కిందకు రావని కాబట్టి వీటికి జీఎస్టీ వర్తిస్తుందని బెంగళూరు, లక్నో ఏఏఆర్ బెంచ్లు తీర్పునిచ్చాయి.

హాస్టల్స్కు జీఎస్టీ నుంచి మినహాయిపు ఇవ్వాలని కర్నాటకకు చెందిన శ్రీ సాయి లగ్జరీస్ స్టే సంస్థ ఏఏఆర్ను ఆశ్రయించింది. హాస్టళ్లలో సంబంధం లేని వ్యక్తులు షేరింగ్ చేసుకుంటారు. బెడ్ ల వారిగా ఫీజు వసూల్ చేస్తారు. పర్సనల్ కిచెన్ ఉండదు. అలాంటిది గృహ వసతి కిందకు ఎందుకు వస్తుందని ఏఏఆర్ స్పష్టం చేశారు. హోటళ్లు, రిసార్టులు వసతికి గానూ రోజుకు రూ.1000 లోగా అయితే జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని గుర్తు చేసింది.

యూపీలోని నోయిడాకు చెందిన వీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ హాస్టల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సైతం ఇదే అంశంపై లక్నో ఏఏఆర్ బెంచ్ను ఆశ్రయించింది. అక్కడ కూడా సేమ్ తీర్పు వచ్చింది. అయితే ఈ తీర్పుల వల్ల విద్యార్థుల కుటుంబాలపై అదనపు భారం పడుతుందని పలువురు అంటున్నారు. ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ విధానపరమైన నిర్ణయం తీసకోవాలని కోరుతున్నారు. మరి దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి..


Updated : 29 July 2023 4:40 PM GMT
Tags:    
Next Story
Share it
Top