Home > జాతీయం > Digital Voter ID Card: మీ ఫోన్‌ ద్వారానే డిజిటల్ ఓటర్ కార్డు.. వెరీ ఈజీ

Digital Voter ID Card: మీ ఫోన్‌ ద్వారానే డిజిటల్ ఓటర్ కార్డు.. వెరీ ఈజీ

Digital Voter ID Card: మీ ఫోన్‌ ద్వారానే డిజిటల్ ఓటర్ కార్డు.. వెరీ ఈజీ
X

భారతదేశంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ ఐడీ కార్డ్( voter id card ) తప్పనిసరి అందరికీ తెలిసిందే.అయితే ఇంట్లో కూర్చునే ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఫోటోతో కూడిన డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తోంది. . త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.





ఓటర్​ ఐడీ కార్డు అంటే చాలా మందికి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆ రోజు వరకే చేతిలో ఉంచుకుని తర్వాత భద్రంగా దాచిపెడతారు. కానీ ఓటర్​ ఐడీ కార్డు ఎన్నికలప్పుడు మాత్రమే కాక ఇతర సందర్భాల్లోను ఉపయోగపడుతుంది. ఈ కార్డును ప్రతీ సారి మన వెంట తీసుకెళ్ల లేము. ఒక్కోసారి పొరపాటున మర్చిపోతుంటాం. అలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం స్మార్ట్​ ఫోన్​లోనే ఈ డిజిటల్​ ఓటర్​ ఐడీ కార్డుని డౌన్​లోడ్​ చేసుకోనే అవకాశం కల్పించింది.

ఆధార్, పాన్ కార్డు మాదిరిగానే డిజిటల్ ఓటర్ కార్డు కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్​ కార్డును ఎన్నికల సమయంలో చూపించి ఓటు వేయవచ్చు. ఈ కార్డుని పీడీఎఫ్​గా డౌన్​లోడ్​ చేసుకుని ప్రింట్​ తీసుకోవచ్చు.

ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి...

1. ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ http://eci.gov.in/e-epic/ లోకి వెళ్లాలి.

2. ఈసీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

3. వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic Download ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి.

4. మీ ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి.

5. వివరాలు అన్ని పూర్తి చేసిన తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.

6. ఆ ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది.

7. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC పైన క్లిక్ చేయాలి.

నాన్ ఎడిటెబుల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది. అంతే నిమిషాల్లోనే మీ స్మార్ట్ ఫోన్‌లో డిజిటల్ కార్డు ఉంటుంది.




Updated : 25 Aug 2023 1:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top