Home > జాతీయం > ట్రాన్స్‌జెండర్‌ను నట్టేట ముంచిపోయిన మొగుడు..

ట్రాన్స్‌జెండర్‌ను నట్టేట ముంచిపోయిన మొగుడు..

ట్రాన్స్‌జెండర్‌ను నట్టేట ముంచిపోయిన మొగుడు..
X

ఆ ఇద్దరు యువకులు మంచి ఫ్రెండ్స్.. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. జెండర్తో సంబంధం లేకుండా ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. దీని కోసం ఒకరు లింగమార్పిడి చేసుకున్నారు. ఆ తర్వాత వివాహం జరిగింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది.

హిషంబాద్‌లో ఉండే ఓ వ్యక్తి కౌశాంబికి చెందిన మరో వ్యక్తితో స్నేహం చేశాడు. తర్వాత వారిద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకునేందుకు లింగమార్పిడి చేసుకోవాలని కౌశంఅతడికి సూచించాడు. ఫ్రెండ్ సలహాతో మరో వ్యక్తి లింగ మార్పిడి చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం వీరిద్దరు ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. అంతా బాగానే సాగిపోతున్న తరుణంలో భర్త గత కొన్ని నెలల నుంచి భాగస్వామిని దూరం పెట్టడం మొదలు పెట్టాడు.

మూడు నెలల క్రితం తనను పూర్తిగా వదిలేశాడని ట్రాన్స్ జెండర్ భార్య వాపోయింది. అప్పటి నుంచి కనీసం ఫోన్‌ కూడా చేయడం లేదని.. ఒకవేళ తాను ఫోన్‌ చేస్తే వాళ్ల తండ్రి బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకోవడానికి లింగ మార్పిడి సర్జరీకి ఆమెకు ఎనిమిది లక్షల వరకు ఖర్చు అయింది. అంతేకాకుండా కొంత కాలంగా తాను సంపాదించిన 6లక్షలను భర్త ఎత్తుకపోయాడని ఆరోపించింది.

బాధితురాలు మొదటి నుంచే ట్రాన్స్ జెండర్ అని.. ఎటువంటి ఆపరేషన్ చేసుకోలేదని నిందితుడు వివరించినట్లు పోలీసులు చెప్పారు. లింగ మార్పిడికి సంబంధించిన ఆస్పత్రి వివరాలు ఇవ్వాలని బాధితుడిని కోరినా ఇవ్వలేదని కౌశాంబి ఎస్పీ బ్రిజేశ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు, అతడి తండ్రిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

Updated : 6 July 2023 9:26 PM IST
Tags:    
Next Story
Share it
Top