Home > జాతీయం > ఆటో డ్రైవర్‌తో అక్రమ సంబంధం.. అడ్డు వస్తున్నాడని భర్త హత్య

ఆటో డ్రైవర్‌తో అక్రమ సంబంధం.. అడ్డు వస్తున్నాడని భర్త హత్య

ఆటో డ్రైవర్‌తో అక్రమ సంబంధం.. అడ్డు వస్తున్నాడని భర్త హత్య
X

అక్రమ సంబంధాలు ఆయువు తీస్తున్నాయి. పరాయి మగాడి మోజులో పడి భర్తల ప్రాణాలు తీస్తున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా పక్కింటి మగాడి మోజులో పడి భర్తను దారుణంగా చంపిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా కేజీఎఫ్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే భర్త శంకర్ రెడ్డి కనిపించడం లేదంటూ సునంద అనే మహిళ డిసెంబర్ 29న బేతమంగళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు మేరకు బేతమంగళ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే రెండు రోజుల తర్వాత శంకర్‌రెడ్డి ఆచూకి కనిపించడం లేదంటూ ఆయన బంధువు బాబురెడ్డి మరో ఫిర్యాదు చేశాడు.

శంకర్ రెడ్డి భార్య సునంద, ఆమె స్నేహితుడు వెంకటేష్ తమ బంధువు శంకర్ రెడ్డిని హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ రెండు ఫిర్యాదులు అందుకున్న బేతమంగళ పోలీసులు విచారణ మెుదలుపెట్టారు.

బాబురెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పోలీసులు కూడా శంకర్ రెడ్డి భార్య సునందపై అనుమానం వ్యక్తం చేశారు. భర్త ఆచూకి దొరకడం లేదని కేవలం ఫిర్యాదు ఇచ్చి సైలెంట్ అయిపోయిన సునందపై పోలీసులు నిఘా పెట్టారు. ఆమె స్నేహితుడు వెంకటేష్

పరారీలో ఉండడంతో పోలీసులకు వారిపై అనుమానం మరింతగా బలపడింది. దీంతో వారిని పట్టుకోని తమదైన శైలిలోొ పోలీసులు విచారించగా అసలు బండారం బయటపడింది. శంకర్ రెడ్డిని తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు.

కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకా కోగిలహళ్లి గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి, భార్య సునంద దంపతులు జీవనోపాధి కోసం బెంగళూరు వైట్ ఫీల్డ్ సమీపంలో టీ దుకాణం పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. అక్కడ చిన్నపాటి అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తుండగా కొన్నేళ్ల క్రితం అక్కడే డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకటేష్.. శంకర్ రెడ్డి నివాసం ఉంటున్న ఇంటి సమీపంలోనే అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో శంకర్ రెడ్డి భార్య సునందతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన శంకర్ రెడ్డి వారిని పలు సార్లు హెచ్చరించాడు. దీంతో ఎలాగైనా శంకర్ రెడ్డి చంపాలని ప్లాన్ చేసిన వారు .. డిసెంబర్ 27న వెంకటేష్ శంకరరెడ్డిని తీసుకెళ్లి చిక్కబళ్లాపూర్ జిల్లా కెంచర్లహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కెంచర్లహళ్లి సమీపంలో జాక్ రాడ్‌తో కొట్టి హత్య చేసి మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేశాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయి మరో ఊరిలో తల దాచుకున్నాడు. చివరికి పోలీసుల లోతుగా విచారణ జరిపి సునందను ఆమె ప్రియుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated : 11 Jan 2024 7:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top