Home > జాతీయం > భార్య మనసు అర్థం చేసుకుని.. ప్రియుడితో పెళ్లి చేయించిన భర్త

భార్య మనసు అర్థం చేసుకుని.. ప్రియుడితో పెళ్లి చేయించిన భర్త

భార్య మనసు అర్థం చేసుకుని.. ప్రియుడితో పెళ్లి చేయించిన భర్త
X

ఓ భర్త, భార్య విషయంలో పెద్ద మనసు చేసుకున్నాడు. ఆమె ప్రేమించిన వ్యక్తితో దగ్గరుండి పెళ్లి చేయించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో జరిగింది. అమోయ్ పూర్వా గ్రామానికి చెందిన దినేశ్, గులాబీలకు ఏడాది క్రితం పెళ్లైంది. కొన్ని రోజులుగా తన భార్య పక్కింటి రాహుల్ అనే యువకుడితో ఫోన్ మాట్లాడటం గమనించిన దినేశ్.. మొదట గులాబిని మందలించాడు. తర్వాత భార్య మనసు అర్థం చేసుకుని.. తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. వాళ్లందరి పర్మిషన్ తీసుకుని.. గురువారం సాయంత్రం ఓ గుడిలో సంప్రదాయబద్ధంగా ఆ ఇద్దరు ప్రేమికులకు పెళ్లి జరిపించాడు. విషయం తెలిసి గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టగా.. వారికి అర్థం అయ్యేలా వివరించి ప్రేమికులిద్దరిని కలిపాడు. ప్రస్తుతం ఈ పెళ్లి వార్త చుట్టు పక్కల గ్రామాల్లో పాకి.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.




Updated : 1 July 2023 4:20 PM IST
Tags:    
Next Story
Share it
Top