Home > జాతీయం > ఫైవ్ ఐస్, ఎఫ్బీఐ సభ్యున్ని కాదు.. కెనడా వివాదంపై జై శంకర్ ఘాటు రిప్లై

ఫైవ్ ఐస్, ఎఫ్బీఐ సభ్యున్ని కాదు.. కెనడా వివాదంపై జై శంకర్ ఘాటు రిప్లై

ఫైవ్ ఐస్, ఎఫ్బీఐ సభ్యున్ని కాదు.. కెనడా వివాదంపై జై శంకర్ ఘాటు రిప్లై
X

"ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలపై దుమారం కొనసాగుతోంది." ఈ అంశంపై భారత్ - కెనడాల మధ్య ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా భారత విదేశాంగ మంత్రి మరోసారి స్పందించారు.

ఐక్యరాజ్యసమితి 78వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ లో మంత్రి జై శంకర్ మాట్లాడారు. కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని జై శంకర్ మరోసారి తీవ్రంగా ఖండించారు. ట్రూడో ఆరోపించినట్లు భారత్ అలాంటి చర్యలకు పాల్పడదని జైశంకర్ స్పష్టం చేశారు. కెనడా ప్రభుత్వ ఆరోపణలకు సంబంధించి వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు అందలేదని చెప్పారు. నిజ్జర్ హత్యకు సంబంధించి సరైన సమాచారం ఇస్తే భారత్ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఫైవ్‌ ఐస్‌ అలయెన్స్కున్న సమాచారం ఆధారంగానే ట్రూడో ఆ ఆరోపణలు చేసి ఉంటారన్న అమెరికా దౌత్యవేత్త కామెంట్లపైనా మంత్రి జై శంకర్ ఘాటుగా స్పందించారు. ఈ అంశంపై ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. తాను ఫైవ్‌ ఐస్‌లో భాగం కాదని, ఎఫ్‌బీఐకి చెందిన సభ్యున్ని అంతకన్నా కాదని అన్నారు. ఈ ప్రశ్న అడగాల్సింది తనను కాదనుకుంటున్నా’ అని సమాధానమిచ్చారు. విశ్వసనీయ సమాచార మార్పిడి కోసం అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు ఫైవ్‌ఐస్‌గా ఏర్పడ్డాయి.

Updated : 27 Sept 2023 1:24 PM IST
Tags:    
Next Story
Share it
Top