Home > జాతీయం > Vijayashanthi : బీజేపీని వీడి కాంగ్రెస్లోకి అందుకే వెళ్లాను : విజయశాంతి

Vijayashanthi : బీజేపీని వీడి కాంగ్రెస్లోకి అందుకే వెళ్లాను : విజయశాంతి

Vijayashanthi  : బీజేపీని వీడి కాంగ్రెస్లోకి అందుకే వెళ్లాను : విజయశాంతి
X

కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వస్తున్న విమర్శలను విజయశాంతి ఖండించారు. బీజేపీ ఇచ్చిన మాట తప్పినందునే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ‘‘నాడు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి మరికొందరు బీజేపీ ప్రముఖులు నా దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ అవినీతిపై తప్పక చర్యలుంటాయని చెప్పారు. మీరందరూ సమర్థిస్తే కేంద్రంలోని బీజేపీ ఎంతవరకైనా పోరాడుతదని చెప్పి నన్ను, వివేక్‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఒప్పించారు. అందుకు కేంద్ర పెద్దలతో హామీ ఇప్పించి చేర్చుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.

‘‘రాష్ట్రంలోని దుర్మార్గ పాలన పోవాలి.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లాం. మాట నిలబెట్టుకోక.. మమ్మల్ని మోసగించి, బీఆర్ఎస్తో బీజేపీ అవగాహన పెట్టుకున్నది తెలియడంతో పలువురు నాయకులు బీజేపీని వీడారు. విమర్శలు తేలిక.. ఆత్మ పరిశీలన అవసరం’’ అని విజయశాంతి ట్వీట్‌ చేశారు.


Updated : 19 Nov 2023 8:57 PM IST
Tags:    
Next Story
Share it
Top