Home > జాతీయం > Actor Vishal: నా ప్రధానికి, ఆయనకూ థాంక్యూ సో మచ్ : విశాల్‌

Actor Vishal: నా ప్రధానికి, ఆయనకూ థాంక్యూ సో మచ్ : విశాల్‌

Actor Vishal: నా ప్రధానికి, ఆయనకూ థాంక్యూ సో మచ్ : విశాల్‌
X

కోలీవుడ్ నటుడు విశాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‎పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాను నటించిన సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ విడుదల కోసం సెన్సార్‌ బోర్డ్‌ రూ.6.5 లక్షలు లంచం తీసుకున్నారంటూ ప్రూఫ్స్‎తో సహా ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ విషయంపై సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‎కాస్టింగ్ డిపార్ట్‎మెంట్ వెంటనే స్పందించింది. ఈ అంశంపై విచారణ చేపట్టాలని ఒక సీనియర్‌ ఆఫీసర్‎ను నియమించి ముంబైకు పంపింది. అంతేకాదు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‎ వేధింపులకు గురైన వారు ఎవరైనా ఉంటే వారి సమస్యను తెలిపేందుకు jsfilms.inb@nic.inను సంప్రదించాలని కేంద్ర సమాచార శాఖ తెలిపింది.

ఈ విషయంపై మరోసారి హీరో విశాల్‌ స్పందించాడు. " నా ఫిర్యాదుతో వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టినందుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇది చాలా సంతోషించాల్సిన విషయం. లంచం తీసుకున్నవారిపై తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ సంఘటన అవినీతికి పాల్పడే ప్రతి అధికారికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆశిస్తున్నా. దేశంలో అవినీతి పెరగకుండా నిజాయితీ గల సేవా మార్గాన్ని తీసుకోవాలని ఆశిస్తున్నా. నా కంప్లైంట్‎తో వెంటనే రియాక్ట్‌ అయ్యేలా చూసిన నా ప్రధాని నరేంద్ర మోదీ గారికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా లాంటి సామాన్యుడికి సర్కార్ నుంచి న్యాయం జరుగుతుందనే నమ్మకం పెరుగుతుంది" అంటూ విశాల్‌ తెలిపాడు.

Updated : 30 Sept 2023 3:00 PM IST
Tags:    
Next Story
Share it
Top