Home > జాతీయం > రెస్టారెంట్ సిబ్బందిపై IAS, IPS అధికారుల దాడి.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం

రెస్టారెంట్ సిబ్బందిపై IAS, IPS అధికారుల దాడి.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం

రెస్టారెంట్ సిబ్బందిపై IAS, IPS అధికారుల దాడి.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం
X

రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఒక రెస్టారెంట్‌ వద్ద ఘర్షణ చోటుచేసుకోగా.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో ఓ ఐఏఎస్, ఓ ఐపీఎస్ అధికారి ఉండటం గమనార్హం. ఆదివారం(జూన్ 11) అర్థరాత్రి జరిగిన ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవి కాస్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారడం వల్ల విషయం వెలుగులోకి వచ్చిందిఈ మేరకు హోటల్ సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంది రాజస్థాన్​ ప్రభుత్వం.

సస్పెండ్ అయిన అధికారుల్లో అజ్​మేర్​ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ ఐఏఎస్ అధికారి​ గిరిధర్​ ఉన్నారు. గంగాపుర్ సిటీ పోలీస్‌ శాఖలో స్పెషల్ ఆఫీసర్​గా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్​ సుశీల్ కుమార్ బిష్ణోయ్‌ కూడా హోటల్​ సిబ్బందిపై దాడి చేసినట్లుగా గుర్తించారు అధికారులు. వీరితో పాటు పట్వారీ నరేంద్ర సింగ్ దహియా, కానిస్టేబుల్ ముఖేశ్​ కుమార్, ఎల్‌డీసీ హనుమాన్ ప్రసాద్ చౌదరీలు కూడా ఉన్నతాధికారులకు సహకరించారని అధికారులు చెప్పారు. తమ హోటల్​ సిబ్బందిపై సోమవారం అర్ధరాత్రి ఓ ఐపీఎస్ అధికారి, ముగ్గురు నలుగురు పోలీసులతో కలిసి దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ హోటల్ యాజమాన్యం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై గేగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అధికారులందరూ సోమవారం రాత్రి ఓ పార్టీకి హాజరై తిరిగి వస్తుండగా మార్గమధ్యలో వాష్‌రూమ్‌ అవసరం రావడంతో.. హైవే పక్కన ఉన్న రెస్టారెంట్ వెలుపల వాహనం ఆపి, అందులోకి వెళ్లే ప్రయత్నం చేశారు. తలుపులు తెరవాలని అక్కడ సిబ్బందిని కోరడంతో వాగ్వాదం మొదలైంది. అర్ధరాత్రి కావడం వల్ల సేవలందించేందుకు హోటల్​ సిబ్బంది నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తులైన అధికారులు వారిపై వాగ్వాదానికి దిగి దాడి చేశారు. ఈ క్రమంలో ఓ ఐపీఎస్​ అధికారి సుశీల్ కుమార్​.. హోటల్​ ఓ హోటల్ ఉద్యోగిని చెప్పుతో కొట్టినట్లు సీసీటీవీలో రికార్డయింది. అయితే, ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ మాత్రం తనపై చేస్తోన్న ఆరోపణలను తోసిపుచ్చారు.

Updated : 15 Jun 2023 10:49 AM IST
Tags:    
Next Story
Share it
Top