Home > జాతీయం > Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదులో దొరికిన విష్ణుమూర్తి, హనుమంతుడి విగ్రహాలు

Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదులో దొరికిన విష్ణుమూర్తి, హనుమంతుడి విగ్రహాలు

Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదులో దొరికిన విష్ణుమూర్తి, హనుమంతుడి విగ్రహాలు
X

(Gyanvapi Mosque) కాశీలోని జ్ఞానవాపి మసీదులో విష్ణుమూర్తి, ఆంజనేయస్వామి విగ్రహాలు లభించాయి. మసీదు కింద ఇటీవలె జరిపిన తవ్వకాల్లో హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్లుగా భారత పురాతత్వశాఖ తెలిపింది. ఆ విగ్రహాల్లో విష్ణువు, హనుమంతుడివి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మసీదు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని ఏఎస్ఐ కోర్టులో వాదించింది. ఆ క్రమంలోనే సుప్రీంకోర్టు అనుమతితో తవ్వకాలు చేపట్టింది. తవ్వకాల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయి.





బయటపడిన కళాఖండాల్లో విష్ణుమూర్తి, హనుమాన్ విగ్రహాలున్నాయి. అందులో హనుమంతుడి విగ్రహం సగం విరిగిపోయి ఉంది. కింది సగభాగం మాత్రమే ఉండగా అందులో శిల్పం కాళ్లు రాతిపై ఉన్నాయి. ఇంకో విగ్రహం మధ్యయుగ ప్రారంభ కాలం నాటిదని అధికారులు స్పష్టం చేశారు. ఆ శిల్పంలో సగం మనిషి, సగం సర్పం ఉంది. ఆ విగ్రహం విష్ణుమూర్తి వరాహావతారాన్ని పోలి ఉందని అధికారులు తెలిపారు.





తవ్వకాల్లో మరో విష్ణుమూర్తి విగ్రహం నాలుగు చేతులతో శంకు, చక్రాలు ధరించి కూర్చున్నట్లుగా ఉంది. ఆ విగ్రహం కూడా విరిగిపోయి ఉంది. అలాగే విష్ణువు రూపాలతో ఉన్న మరో రెండు శిల్పాలు కూడా లభించాయి. అందులో ఒకటి పీఠంపై నిలబడిన ఆకారంలో ఉంది. మరొకటి విష్ణువు పక్కన భక్తుడు, పరిచారిక ఉన్నట్లు రాత్రి విగ్రహం లభ్యం అయ్యింది. అలాగే ఒక చేత్తో గదాధారుడై ఉన్న హనుమంతుడు విగ్రహం లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వారణాసి కోర్టు కీలక తీర్పునిచ్చింది. మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చని తెలిపింది.


Updated : 1 Feb 2024 2:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top