Home > జాతీయం > జైలులోనే కేబినెట్ మీటింగ్.. అక్కడి నుంచే పాలన.. - ఆప్ ఎమ్మెల్యేలు

జైలులోనే కేబినెట్ మీటింగ్.. అక్కడి నుంచే పాలన.. - ఆప్ ఎమ్మెల్యేలు

జైలులోనే కేబినెట్ మీటింగ్.. అక్కడి నుంచే పాలన.. - ఆప్ ఎమ్మెల్యేలు
X

లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు త్వరలో అరెస్టయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నయి. ఈ కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు వెళ్లాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేజ్రీవాల్ విచారణకు వెళ్తే అరెస్ట్ చేస్తారని తమకు సమాచారం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు.

కేజ్రీవాల్తో మీటింగ్ అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే ఆయన జైలు నుంచే పాలన కొనసాగించేలా కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటామని ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్పై కేంద్రం అరాచకాలకు పాల్పడుతోందని, ఆ విషయం ప్రజలు కూడా గమనిస్తున్నారని అన్నారు. అందుకే ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి జైలుకు వెళ్లినా సీఎంగానే కొనసాగుతారని ఆ పార్టీ నేత ఆతిషీ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కేజ్రీవాల్కు చెప్పామని అన్నారు.

కేజ్రీవాల్‌కు అధికారం దూరం చేయలేమని గ్రహించిన బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తోందని మరో ఎమ్మెల్యే భరద్వాజ్ అన్నారు. కేజ్రీవాల్‌ అరెస్టైతే అధికారులు సమావేశాల కోసం జైలు వద్దకే వెళ్తారని చెప్పారు. తమను కూడా త్వరలోనే జైలుకు పంపే అవకాశముందని ఆతిషీని జైలు నంబర్‌ 2, తనను జైలు నంబర్‌ 1లో ఉంచే ఛాన్సుందని, ఒకవేళ అలా జరిగితే జైలులోనే కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తామని భరద్వాజ్ స్పష్టం చేశారు.



Updated : 6 Nov 2023 9:08 PM IST
Tags:    
Next Story
Share it
Top