Home > జాతీయం > జ్ఞానవాపిని మసీదు అనలేం.. యోగి వివాదాస్పద వ్యాఖ్యలు

జ్ఞానవాపిని మసీదు అనలేం.. యోగి వివాదాస్పద వ్యాఖ్యలు

జ్ఞానవాపిని మసీదు అనలేం.. యోగి వివాదాస్పద వ్యాఖ్యలు
X

జ్ఞానవాపిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపి సముదాయాన్ని మసీదు అనలేమని అన్నారు. ప్రజలు దానిని పరిశీలించాలని, తెలుసుకోవాలని అనుకుంటున్నారని అన్నారు. సోమవారం ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ముస్లిం పక్షం తన చారిత్రక తప్పిదాన్ని అంగీకరించాలని, పరిష్కారాన్ని ప్రతిపాదించాలని యోగి అన్నారు. ‘‘మేము జ్ఞానవాపిని మసీదు అని పిలవలేం. అలా పిలిస్తే వివాదం అవుతుంది. ప్రజలు పరిశీలించాలని నేను అనుకుంటున్నాను. మసీదు లోపల 'త్రిశూలం' ఏం చేస్తోంది. మేము దానిని అక్కడ ఉంచలేదు. జ్యోతిర్లింగం ఉంది. దేవుడి విగ్రహాలు ఉన్నాయి, గోడలు అరుస్తున్నాయి.’’ అని అన్నారు. ముస్లింల తప్పుకు పరిష్కారం కావాలి అని ముఖ్యమంత్రి అన్నారు.

అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్.. ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలకు మద్ధతు పలికారు. సౌభ్రాతృత్వం, సద్భావన సందేశం ఇచ్చేందుకు ముస్లిం పిటిషనర్లకు ఇదొక మంచి అవకాశమన్నారు

Updated : 31 July 2023 2:22 PM IST
Tags:    
Next Story
Share it
Top