Home > జాతీయం > Ayodhya mosque : అయోధ్యలో మసీద్ నిర్మాణం.. మక్కా నుంచి తొలి రాయి

Ayodhya mosque : అయోధ్యలో మసీద్ నిర్మాణం.. మక్కా నుంచి తొలి రాయి

Ayodhya mosque : అయోధ్యలో మసీద్ నిర్మాణం.. మక్కా నుంచి తొలి రాయి
X

అయోధ్యలో రాముని ఆలయం.. వందల ఏళ్ల హిందువుల కల. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతతో హింస చెలరేగింది. రాముని స్థలంలో మసీదు కట్టారని హిందువుల ఆరోపణ. ఎన్నో ఏళ్ల న్యాయపోరాటం తర్వాత 2019లో అయోధ్యలోని వివాదస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో మసీదు నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో యూపీ సర్కార్ అయోధ్యకు 26 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్లో 5ఎకరాల స్థలాన్ని మసీద్ నిర్మాణానికి కేటాయించింది. అయితే, ఈ నాలుగేళ్లలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది. విగ్రహ ప్రాణ ప్రతిష్ట కూడా జరిగింది. కానీ ఇంకా మసీదు నిర్మాణానికి ఇంకా శంకుస్థాపన జరగలేదు.

ఇప్పుడు ధన్నీపూర్ వెళ్తే ఖాళీగా ఉన్న భూమే స్వాగతం పలుకుతుంది. ఇంకా మసీదు నిర్మాణంలో ఇంకా ఎంత జాప్యం జరుగుతుంది అనే ప్రశ్నకు త్వరలో తెరపడనుంది. మే నెలలో అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఇటీవల ముస్లీం సంస్థ ప్రకటించింది. ఆ ప్రకటనలో.. మసీదు ప్రాజెక్టును ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) డెవలప్మెంట్ కమిటీ పర్యవేక్షిస్తుదని తెలిపింది. మసీదు పునాది కోసం మొదటి ఇటుకను మక్కా నుంచి తీసుకొచ్చారు. ఆ ఇటుకను మక్కాలోని ఝమ్ ఝమ్ బావి నుంచి తెచ్చిన పవిత్ర జలంతో తడిపారు. నల్ల మట్టితో తయారుచేసిన ఈ ఇటుకపై ఉర్దూలో.. మసీదు పేరు, ఖురాన్ లోని కొన్ని పదాలను రాశారు. మార్చి 12న రంజాన్ ఈద్ తర్వాత దీన్ని మసీదు నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్తారు.

Updated : 7 Feb 2024 3:49 PM IST
Tags:    
Next Story
Share it
Top