Home > జాతీయం > బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. రాను రాను మరింత భారీగా..!

బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. రాను రాను మరింత భారీగా..!

బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. రాను రాను మరింత భారీగా..!
X

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రంతాలకు హైలర్ట్ ప్రకటించారు. ప్రజలెవరూ బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మరో వార్త ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రా, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అయితే, అదే ప్రాంతంలో ఈనెల 24న (జులై 24) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతు పవన ద్రోణి కూడా స్థిరంగా ఉండటంతో రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

దాంతో రాగల 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ (జులై 21) తెలంగాణలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. కోస్తాంధ్రా, యానం, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.



Updated : 21 July 2023 6:01 PM IST
Tags:    
Next Story
Share it
Top