Amit Shah : లోక్‌సభ ఎన్నికల లోపే సీఏఏ అమలు : అమిత్ షా
X
పార్లమెంట్ ఎన్నికల లోపే పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. ఢిల్లీ జరిగిన ఈటీ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొని షా మాట్లాడారు. 2019లో తయారు చేసిన సీఏఏ చట్టాన్ని రాబోయే లోక్ సభ ఎన్నికల లోపే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 370 సీట్లు ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్డీఏకు 400 క్రాస్ అవుతాయన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తమ ప్రభుత్వం మూడవ సారి ఏర్పడబోతోందన్నారు. సీఏఏ గురించి ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టించారని, వాళ్లను రెచ్చగొట్టారని, వేధింపులు తట్టుకోలేక జీవనోపాధి కోసం పాక్, ఆఫ్ఘన్, బంగ్లా నుంచి భారత్‌కు వచ్చిన వారికి పౌరసత్వాన్ని ఇవ్వనున్నట్లు అమిత్ షా తెలిపారు. ఎవరి భారతీయ పౌరసత్వాన్ని లాక్కోవడం ఆ చట్టం ఉద్దేశం కాదన్నాని షా చెప్పారు. ఉమ్మడి పౌర స్మృతి అమలు కూడా రాజ్యాంగ లక్ష్యమన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఆ పౌర స్మృతి బిల్లు గురించి చర్చించారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పౌర స్మృతిని విస్మరించిందన్నారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలు చేయడం సామాజిక మార్పు అన్నారు. సెక్యులర్ దేశంలో మతపరమైన పౌరస్మృతులు ఉండవని అమిత్ షా తెలిపారు.