Rose Day : రేపే రోజ్ డే.. పూల రంగుల వెనుక అర్థం ఏంటో తెలుసా..?
X
ప్రేమికులు ఎదురు చూసే వాలైంటైన్ వీక్ వచ్చేసింది. ఈ వారం రోజుల పాటు ప్రేమికులు ఒక్కో రోజు ఒక్కో విధంగా జరుపుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఏటా ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రేమికుల వారోత్సవం జరుపుకుంటారు. అందులో మొదటి రోజు రోజ్ డే. రోజ్ డే రోజున గులాబీలు ఇచ్చి తమ భావాలు వ్యక్తం చేస్తారు. అయితే ఒక్కో రంగు గులాబీకి ఒక్కో అర్థం ఉందని మీకు తెలుసా..? ఎరుపు, పసుపు, గులాబీ, తెలుపు ఇలా ఒక్కో రంగు రోజాలు ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం.
రెడ్ రోజ్
ఎరుపు రంగు ప్రేమకు చిహ్నం. రోమన్ పురాణాల ప్రకారం గులాబీని అభిరుచికి చిహ్నంగా భావిస్తారు. ఎరుపు గులాబీ ప్రేమ దేవతగా పరిగణించే గ్రీకు దేవత ఆఫ్రొడైట్‌కు సంబంధించినది. ఓసారి ఆఫ్రొడైట్ ప్రేమికుడు డోనిస్ గాయపడగా.. అతని కోసం ఆమె పరుగెడుతుండగా.. తెల్ల గులాబీ మొక్కల ముళ్లు గుచ్చుకున్నాయట. అలా ముళ్లు గుచ్చుకోవడంతో పాదాల నుంచి కారిన రక్తం తెల్ల గులాబీలపై పడి అవి ఎర్రగా మారాట. అప్పటి నుంచి ఎర్ర గులాబీలు అంతులేని ప్రేమకు చిహ్నంగా మారాయి.
పింక్ రోజ్
పింక్ కలర్ రోజా పువ్వులు ఆకర్షణ, ఆనందం, కృతజ్ఞతా భావానికి ప్రతీక. తోబుట్టువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు పింక్ కలర్ గులాబీలు ఇవ్వవచ్చు. అంతేకాదు మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నప్పటికీ.. దానిని వ్యక్తపరచలేకపోతే.. వారికి గులాబీ రంగు గులాబీలను బహుమతిగా ఇవ్వవచ్చు.
ఎల్లో రోజ్
పసుపు రంగు గులాబీ పువ్వు స్నేహానికి నాంది. ప్రేమికుల రోజున ఎవరితోనైనా స్నేహాం ప్రారంభించాలనుకుంటే ఎల్లో కలర్ రోజ్ బెస్ట్ ఛాయిస్. ఏదైనా బంధం ప్రారంభానికి సంకేతంగా ఎల్లో రోజ్ను భావిస్తారు. ఎల్లో కలర్ మీకు ఎదుటివారిపై ఉన్న శ్రద్ధను చూపుతుంది.
వైట్ రోజ్
రోజ్ డే రోజున తెల్ల గులాబీలను ఇవ్వడం పక్కన పెట్టేశారు. అయితే ఈ రంగు పువ్వు శాంతి, స్వచ్ఛతకు సంకేతం. అవతలి వ్యక్తి పట్ల మనకున్న స్వచ్ఛమైన భావానికి ప్రతీకగా తెల్ల గులాబీలు ఇవ్వవచ్చు. అంతేకాదు.. క్షమాపణ కోరడానికి కూడా తెల్ల గులాబీలను ఉపయోగిస్తారు.
ఆరెంజ్ రోజ్
ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే వారికి ఆరెంజ్ కలర్ రోజ్ ఇవ్వవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరికి ఏ కలర్ రోజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఇచ్చి మీ భావాలను చెప్పేయండి. హ్యాపీ వాలెంటైన్ వీక్