Home > జాతీయం > ఫ్రీ బస్ జర్నీ కోసం.. బుర్కా వేషం ధరించాడు.. తర్వాత ఏం జరిగిందంటే..?

ఫ్రీ బస్ జర్నీ కోసం.. బుర్కా వేషం ధరించాడు.. తర్వాత ఏం జరిగిందంటే..?

ఫ్రీ బస్ జర్నీ కోసం.. బుర్కా వేషం ధరించాడు.. తర్వాత ఏం జరిగిందంటే..?
X

ఉచిత పథకాలు మనిషిని ఏ పనైనా చేయనిస్తాయి. తాజాగా కర్నాటకలో ఓ హిందూ వ్యక్తి.. బుర్కా ధరించి మహిళల బస్సులో ప్రయాణించాడు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం అని ప్రకటించారు. పార్టీ అధికారంలోకి రాగానే.. మొదట ఆ హామీపైనే సంతకం చేశారు. ఇక అప్పటి నుంచి కర్నాటక బస్సుల్లో ఏ రేంజ్ లో రష్ ఉంటుందో చెప్పక్కర్లేదు. దాంతో ధార్వాడ్ జిల్లాకు చెందిన వీరభద్రయ్య అనే వ్యక్తి మహిళ అవతారం ఎత్తాడు. బుర్కా ధరించి మహిళలా బస్సులో ఫ్రీగా ప్రయాణించే ప్రయత్నం చేశాడు. అయితే, బస్సులోని ఇతర ప్రయాణికులు వీరభద్రయ్యను గుర్తించి కండక్టర్ కు పట్టించారు.





బస్టాప్ నుంచే వీరభద్రయ్యపై అనుమాన పడిన ప్రయాణికులు.. వెంబడించారు. బస్సులో అతని గుట్టు బయటపడటంతో.. దేహ శుద్ది చేసి ప్రశ్నించారు. దాంతో తాను భిక్షాటన కోసం బుర్కా వేశం ధరించినట్లు చెప్పుకొచ్చాడు. అతని దగ్గర ఓ మహిళ ఆధార్ కార్డ్ కూడా దొరికింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






Updated : 7 July 2023 3:01 PM IST
Tags:    
Next Story
Share it
Top