Home > జాతీయం > మూడోసారి గెలిస్తే.. ప్రపంచ మూడో ఆర్థిక శక్తిగా భారత్ : మోదీ

మూడోసారి గెలిస్తే.. ప్రపంచ మూడో ఆర్థిక శక్తిగా భారత్ : మోదీ

మూడోసారి గెలిస్తే.. ప్రపంచ మూడో ఆర్థిక శక్తిగా భారత్ : మోదీ
X

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తే.. ప్రపంచంలో భారత్ మూడో ఆర్థికశక్తిగా అవతరిస్తుందని అన్నారు. రానున్న 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తయారుచేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. భారత్‌ ఊహించని స్థాయిలో ఎన్నో విజయాలు సాధిస్తోందన్న ఆయన.. భారత్‌ అభివృద్ధి ప్రయాణం ఆగదన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ను ప్రధాని ప్రారంభించారు. ఈ కన్వెన్షన్ సెంటర్కు భారత్ మండపం అని పేరు పెట్టారు.

భారత్ మండపాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. భారత్ మండపం ప్రపంచానికి మన శక్తిని చాటి చెప్తుందని చెప్పారు. దేశంలో అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కొన్ని వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని.. కానీ వారి ఆటలు సాగవన్నారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రతి ఒక్కరు గొప్పగా చెప్పుకుంటారని తెలిపారు. పని చేసే విధానాన్నే కాకుండా పని వాతావరణాన్నే మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గొప్ప కలలు కనండి.. వాటి సాకారానికి తగ్గట్లు శ్రమించాలని మోదీ సూచించారు.

విపక్షాలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలు తిరస్కరించిన ముఖాలు మాత్రం అలాగే ఉంటాయని మోదీ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రికార్డుస్థాయిలో విజయం సాధిస్తుందని చెప్పారు. ఇక భారత్ అభివృద్ధి ప్రయాణం ఆగదని స్పష్టం చేశారు. కాగా 123 ఎకరాల్లో 2700 కోట్లతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ను నర్మించారు. ఇక్కడే భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఆయా దేశాధినేతలు, ప్రధానులు, విదేశీ ప్రతినిధులు హజరుకానున్నారు

Updated : 26 July 2023 10:06 PM IST
Tags:    
Next Story
Share it
Top