Home > జాతీయం > కొత్త ఏడాదిని.. 16 సార్లు సెలబ్రేట్‌ చేసుకోనున్న వ్యోమగాములు.. ఎలాగంటే?

కొత్త ఏడాదిని.. 16 సార్లు సెలబ్రేట్‌ చేసుకోనున్న వ్యోమగాములు.. ఎలాగంటే?

కొత్త ఏడాదిని.. 16 సార్లు సెలబ్రేట్‌ చేసుకోనున్న వ్యోమగాములు.. ఎలాగంటే?
X

ప్రపంచమంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. ముందుగా న్యూజిలాండ్‌‌ దేశ ప్రజలు నూతన సంవత్సరానికి వెల్‌కం చెప్పగా.. చివరిగా అమెరికా ప్రజలు న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. అయితే ప్రపంచంలో ఏ దేశ ప్రజలైన

న్యూ ఇయర్‌ను ఒక్కసారి మాత్రమే సెలబ్రేట్‌ చేసుకుంటారు. కానీ అంతరిక్షంలోని వ్యోమగాముల టీమ్ మాత్రం కొత్త ఏడాదిని 16 సార్లు సెలబ్రేట్‌ చేసుకుంది. ఏంటీ ఒక్క వేడుకను 16 సార్లు సెలబ్రేట్‌ చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నిర్ణీత కక్ష్యలో భూమి చుట్టూ అత్యంత వేగంతో పరిభ్రమించడమే దీనికి కారణంగా చెప్పవచ్చు.

వ్యోమగాములు ఉండే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ISS) గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, ప్రతి 90 నిమిషాలకు భూమి చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో సుమారు 16 సూర్యోదయాలు ,16 సూర్యాస్తమయాలను వ్యోమగాములు చూస్తారు. దీంతో వ్యోమగాములు వేర్వేరు టైమ్ జోన్స్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు కొత్త సంవత్సరాన్ని పలుసార్లు సెలబ్రెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

మెుత్తంగా కొత్త ఏడాదిని వ్యోమగాములు 16 సార్లు స్వాగతం పలికారని నాసా వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, 15 దేశాలకు చెందిన ఐదు అంతరిక్ష సంస్థల సహకారంతో, నవంబర్ 2000 నుండి పనిచేస్తుంది. దీనిలో ఏడుగురు వ్యోమగాములు ఉంటారు.

Updated : 1 Jan 2024 10:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top