Home > జాతీయం > ఇక ఆ దేశంలో వారానికి 4 రోజులే పని దినాలు !

ఇక ఆ దేశంలో వారానికి 4 రోజులే పని దినాలు !

ఇక ఆ దేశంలో వారానికి 4 రోజులే పని దినాలు !
X

ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు పని రోజులను మరింత తగ్గిస్తే ఎలా ఉంటుంది? ఉత్పాదకతపై ప్రభావం ఎలా ఉండనుంది? అనే అంశంపై కొన్ని జర్మన్‌ కంపెనీలు తెలుసుకునేందుకు సిద్ధమయ్యాయి. పని రోజులను తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వారానికి 4 రోజుల పని ఎలా ఉంటుందనే విషయంపై అధ్యయనం చేయనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వచ్చే 6 నెలల పాటు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నాయి జర్మనీ కంపెనీలు. కరోనా వైరస్ క్రమంగా కనుమరుగైన సమయంలో ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారు. ఐటీ కంపెనీలు ఇప్పటికే తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అలాగే పని దినాలను మార్చడం కూడా ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. వారంలో 2 రోజుల సెలవు వంటివి ఇప్పటికే చాలా కార్పొరేట్ సంస్థలు అమలు చేస్తున్నాయి.

జర్మనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం మందగమనం నెలకొంది. అదే సమయంలో అధిక ద్రవ్యోల్బణం పట్టిపీడిస్తోంది. ఈ పరిస్థితులపై నిర్వహించిన అధ్యయనం... కొన్ని కీలక సిఫారసులకు బాటలు పరిచింది. వారానికి 4 రోజులే పనిచేయడం వల్ల ఉద్యోగులు తాజాగా, ఆరోగ్యకరంగా ఉంటారని, తద్వారా పనిలో చురుకుదనం పెరిగి, ఉత్పాదకత అధికమవుతుందని జర్మనీ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. కాగా, 4 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేసేందుకు జర్మనీలోని 45 సంస్థలు ముందుకువచ్చాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. వారానికి నాలుగు రోజులు పని రోజులు వల్ల ఉద్యోగులు లీవ్ పెట్టకుండా తగ్గుందని కంపెనీలు భావిస్తున్నాయి

Updated : 30 Jan 2024 10:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top