Home > జాతీయం > Jairam Ramesh: ఇండియా కూటమి లోక్‌సభకే పరిమితం..జైరాం రమేష్

Jairam Ramesh: ఇండియా కూటమి లోక్‌సభకే పరిమితం..జైరాం రమేష్

Jairam Ramesh: ఇండియా కూటమి లోక్‌సభకే పరిమితం..జైరాం రమేష్
X

ఇండియా కూటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 27 విపక్ష పార్టీలతో ఏర్పడిన 'ఇండియా' కూటమి కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకేనని , ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వర్తించదని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లా రామ్‌పుర్‌హట్‌లో శుక్రవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. 27 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి పూర్తి మనుగడలో ఉందని.. కలిసికట్టుగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు.

కేవలం మహారాష్ట్రలోనే కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తాయని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. బీజేపీకి ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ఎన్నడూ సహకరించని ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని, వాటిని పరిరక్షించేందుకు బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని జైరాం రమేష్ ప్రజలకు పిలుపునిచ్చారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రాజకీయ కార్యక్రమం కానప్పటికీ పార్టీకి కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ యాత్ర కాంగ్రెస్‌కు కొత్త శక్తి, పార్టీ పటిష్టకు దోహదమవుతుందని అన్నారు.


Updated : 2 Feb 2024 9:19 PM IST
Tags:    
Next Story
Share it
Top