Home > జాతీయం > జంతర్మంతర్ వద్ద ఇండియా కూటమి నేతల ధర్నా

జంతర్మంతర్ వద్ద ఇండియా కూటమి నేతల ధర్నా

జంతర్మంతర్ వద్ద ఇండియా కూటమి నేతల ధర్నా
X

పార్లమెంటులోకి ఆగంతకుల చొరబాటుపై ప్రశ్నించిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ కూటమి దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా విపక్ష నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. సేవ్ డెమోక్రసీ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ సహా పలువురు నేతలు ఈ ఆందోళనలో భాగమయ్యారు.

పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై కేంద్రం ఉభయ సభల్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో ప్రతిపక్షాలకు చెందిన 146 మంది లోక్ సభ, రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేశారు. దీనికి నిరసనగా ఇండియా కూటమి నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ 146 మంది ఎంపీలు సస్పెండైన పరిస్థితులు లేవని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించి, ఇండియా కూటమిని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు.

Updated : 22 Dec 2023 9:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top