బీజేపీని ఇండియా కూటమి కచ్చితంగా ఓడిస్తుంది : రాహుల్ గాంధీ
X
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీని ఢీకొట్టేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి మూడో సమావేశం తాజాగా ముంబయిలో ముగిసింది. 28 పార్టీలకు చెందిన నాయకులు ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని ఇండియా కూటమిలోని పార్టీలు తీర్మానించాయి. ఈ నేపథ్యంలో మూడోవారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కూటమి నిర్ణయించింది. ప్రధానంగా మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కూటమి డిసైడ్ అయ్యింది. జుడేగా ఇండియా..జీతేగా ఇండియా నినాదంతో ముందుకు వెళ్లనుంది.
ఇండియా కూటమి భేటీలో రాహుల్ మాట్లాడుతూ.." ఈ వేదికపై 60 శాతం భారత్ ఉంది. ఈ బలమైన శక్తిని ఓడించడం బీజేపీ తరం కాదు. ఎన్నికలు చాలా దగ్గర్లోనే ఉన్నాయి. G20 శిఖరాగ్ర సదస్సు త్వరలోనే జరగనుంది. అదానీ విషయంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలి. ఈ మీటింగ్ సీనియర్లు జూనియర్ల మధ్య ఐకమత్యాన్ని తీసుకువచ్చింది. ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము.ఎన్నికల ప్రచారం కూడా ఉమ్మడిగానే చేస్తాము. అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాము. ఇండియా కూటమి బలంగా మారింది. మమ్మల్ని ఓడించే సత్తా బీజేపీకి లేదు"అని అన్నారు.
India alliance will definitely defeat BJP says Rahul Gandhi
India alliance, defeat BJP, Rahul Gandhi, Congress Leader, Mumbai, meeting, elections, assembly elections, ruling party, BJP, political news, National news, 28 parties, key decisions , Lok Sabha elections, election campaign, agitation programs, Modi , Judega India..Jeetaga India , prime minister, PM, India, strong force, The G20 summit , Adani's case,