Home > జాతీయం > చైనాను వణికిస్తున్న వైరస్‌పై కేంద్రం ప్రకటన

చైనాను వణికిస్తున్న వైరస్‌పై కేంద్రం ప్రకటన

చైనాను వణికిస్తున్న వైరస్‌పై కేంద్రం ప్రకటన
X

ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ (హెచ్‌9ఎన్‌2)తో చైనా వణికిపోతోంది. శ్వాసకోశాలకు సంబంధించిన ఈ వ్యాధి కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండంతో కోవిడ్ 19 లాగే ఇది కూడా మన దేశానికి వ్యాపిస్తుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా బాలల్లో కనిపిస్తున్న ఏవియన్‌ వైరస్‌తో మన దేశానికి ముప్పు దాదాపుగా లేనట్టేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

‘‘ఉత్తర చైనాలో నమోదవుతున్న ఇన్‌ఫ్లుయెంజా కేసును ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. అవి సాధారణ కేసులే. అంతుచిక్కని వ్యాధి కారకాలు, అసాధారణ లక్షణాలు బయటపడలేదు. అది మన దేశంలో వ్యాపించే అవకాశం చాలా తక్కువ. ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశాలు తక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఈ కేసుల్లో మరణాల శాతం కూడా తక్కువే. అయినప్పటికీ ఎలాంటి అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని వివరించింది.

ఉత్తర చైనాలో పిల్లలు అంతుచిక్కని నిమోనియా బారిన పడుతున్నారు. దగ్గు లేకపోయినా శాస ఆడకపోవడం, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అక్టోబ‌ర్, నవంబర్ లలో చైనా బాలల్లో శ్వాస‌కోశ వ్యాధులు మామూలేనని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ కేసులు పెరగడానికి సాధారణ ప్యాథోజెన్లే కార‌ణ‌మ‌ని వెల్లడించింది. అయితే చైనా ఈ కేసుల వివరాలను దాచిపెడుతోందనో అనుమానాలు వ్యక్తవుతున్నాయి. బీజింగ్‌లోని ఓ పెద్దాస్పత్రుల్లో ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రతి రోజూ 1200 మందికిపైగా ఎమర్జెన్సీ వార్డుల్లో చేరుతున్నట్లు వార్తలలు వస్తున్నాయి.

Updated : 24 Nov 2023 10:35 PM IST
Tags:    
Next Story
Share it
Top