Home > జాతీయం > Solar Bicycles : భారత్‌లో సోలార్ సైకిళ్ల తయారీ.. ప్రపంచంలోనే తొలిసారి

Solar Bicycles : భారత్‌లో సోలార్ సైకిళ్ల తయారీ.. ప్రపంచంలోనే తొలిసారి

Solar Bicycles : భారత్‌లో సోలార్ సైకిళ్ల తయారీ.. ప్రపంచంలోనే తొలిసారి
X

ప్రపంచంలోనే తొలిసారిగా భారత్ సోలార్ సైకిళ్లను తయారు చేస్తున్నారు. దేశంలో సోలార్ సైకిళ్లను తయారు చేసి ఆ తర్వాత ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. భారత్ తయారు చేసే ఈ సోలార్ సైకిళ్లను ఎలక్ట్రిక్ వాహనం లాగా ఉపయోగించవచ్చు. ఈ సోలార్ సైకిళ్లను బరోడా ఎలక్ట్రిక్ మీటర్స్ లిమిటెడ్ కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే ఓ ఘనతను సాధించింది. గుజరాత్ రాష్ట్రంలో గృహాలకు అమర్చిన ఎనర్జీ మీటర్లను ఈ కంపెనీయే గతంలో తయారు చేసింది.

తాజాగా వల్లభ్ విద్యానగర్ లోని బిర్లా విశ్వకర్మ మహావిద్యాలయంలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించారు. ఆ విద్యార్థుల సాయంతో వరల్డ్ వైడ్ ఫస్ట్ సోలార్ సైకిల్ రోలౌట్, డిస్ట్రప్టివ్ ఇన్నోవేషన్ ఇన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పేరుతో ఓ స్టార్టప్ కంపెనీగా సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ప్రభుత్వాధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ సోలార్ సైకిల్ ప్రాజెక్ట్‌పై ప్రశంసలు కురిపించారు. మెహతా, హితార్ధ్ సోలంకి, ముస్తఫా మున్షీ, రుషీ షా అనే నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు సోలార్ సైకిల్ నమూనాను సిద్ధం చేశారు.

సోలార్ సైకిల్ తయారు చేయడానికి రెండేళ్ల కాలం పట్టింది. ఇకపోతే ఈ సోలార్ సైకిల్‌కు మైక్రో కంట్రోలర్ ఆధారిత బ్యాటరీ ఛార్జ్ కంట్రోలర్‌తో పాటు 40 వాట్స్ సోలాన్ ప్యానెల్‌ను అమర్చారు. ఈ సైకిల్‌‌లో 180w బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ సైకిల్ 12 వోల్ట్స్, 40 వోల్ట్స్ తక్కువ వోల్టేజీలతో పనిచేస్తుంది. భారతదేశంలో తొలిసారి తయారు చేస్తున్న సోలార్ సైకిల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వ్యాపారపరంగా కూడా అధిక శాతం ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

Updated : 15 Feb 2024 7:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top