దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X
దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2,300 చదరపు కి.మీ విస్తీర్ణంతో అతి పెద్ద టైగర్ రిజర్వు ఏర్పాటు కానుంది. దీనికోసం మధ్యప్రదేశ్‌లోని నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభ్యయారణ్యాలను కలిపేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రెండు వన్యప్రాణి అభయారణ్యాలు సాగర్, దమోహ్, నర్సింగ్‌పుర్, రైసెన్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
మరో రెండు మూడు నెలల్లో కొత్త టైగర్ రిజర్వ్‌ని ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కొత్త టైగర్ రిజర్వ్ పులుల సంఖ్య పెరిగేందుకు మరింత సాయపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ఈ ప్రాంతంలో అభివృద్ధితో పాటు పర్యాటకం పెరుగుతుందని చెప్పారు. దామోహ్లోని జబేరా ప్రాంతం చుట్టూ కేంద్రీకృతమైన ఈ టైగర్ రిజర్వ్.. ఇతర ప్రాంతాల నుంచి మరిన్ని పులులను ఆకర్షించే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు.