Home > జాతీయం > Maldives Row : ఒక్క ట్వీట్తో ముగ్గురి మంత్రుల పోస్ట్ ఊస్ట్.. ఇంతకీ ఎవరీ రోషన్ సిన్హా..?

Maldives Row : ఒక్క ట్వీట్తో ముగ్గురి మంత్రుల పోస్ట్ ఊస్ట్.. ఇంతకీ ఎవరీ రోషన్ సిన్హా..?

Maldives Row : ఒక్క ట్వీట్తో ముగ్గురి మంత్రుల పోస్ట్ ఊస్ట్.. ఇంతకీ ఎవరీ రోషన్ సిన్హా..?
X

మాల్దీవులు-భారత్ మధ్య తీవ్ర వివాదాస్పద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీపై మాల్దీవులు మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవ్ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. వారి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమంటూ వివాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది

జరిగిందేంటి?

భారత ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటకంగా మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ వీడియోలను, ఫొటోలను పలు సామాజిక మాధ్యమాలలో సేర్ చేశారు. ఇక మోడీ విజ్ఞప్తికి దేశ పౌరుల నుండి కూడా మంచి స్పందన లభించింది. అయితే మోడీ పోస్ట్‌పై మాల్దీవులు మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. భారత్‌లో హోటల్‌ గదులు అనువైనవి కాదు. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికా?’ మోదీ జోకర్‌, తోలుబోమ్మ అంటూ ట్వీట్లు పెట్టారు.

మరో ఇద్దరూ మంత్రులు దీనిని సమర్థించారు. మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య తీవ్ర దుమారాన్ని లేపాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక వారి వ్యాఖ్యలను రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. కేంద్రం కూడా వారి కామెంట్స్‌పై తీవ్ర అభ్యంతరం తెలిపింది. అలాగే భారత పర్యాటకులు కూడా మాల్దీవ్ హాలిడే ట్రిప్‌లను రద్దు చేసుకుంటున్నారు.

అయితే మెుదటిగా ఈ వివాదానికి ఓ సామాన్యుడి చేసిన ట్విట్ అజ్యం పోసింది. జనవరి 4న గుజరాత్‌కు చెందిన రౌషన్ సిన్హా అనే వ్యక్తి మోదీ లక్షద్వీప్‌లో పర్యటించిన వీడియోను షేర్ చేశాడు. " ఇది చాలా గొప్ప విషయం. చైనీస్ కీలుబొమ్మైనా మాల్దీవ్ నూతన సర్కార్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఇది #Lakshadweep పర్యాటకానికి ఊపుతెస్తుంది" అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌పై మాల్దీవ్ అధికార పార్టీ అయిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) చెందిన మంత్రులు తీవ్రంగా ప్రతిస్పందించారు. మోదీని జోకర్‌గా, ఇజ్రాయెల్ కీలుబొమ్మగా పోలుస్తూ ట్వీట్లు చేశారు.

ఇక వివాదంపై రౌషన్ సిన్హా తాజాగా OpIndiaతో మాట్లాడుతూ.. " మాల్దీవులలో ప్రతిపక్షాలు భారతదేశానికి అనుకూలంగా ఉన్నాయి, అయితే మొహమ్మద్ ముయిజు నేతృత్వంలోని పాలక ప్రభుత్వం మాత్రం చైనాకు అనుకూలంగా" ఉందన్నారు. మాల్దీవుల-భారత్ మధ్య వివాదం నడుస్తున్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటించడం కూడా.. ఆ దేశ ప్రభుత్వం మద్దతు ఎవరి వైపో చెప్పకనే చెబుతోంది. సిన్హా గుజరాత్‌లో నివసిస్తున్న బీహారీ వ్యాపారవేత్త, భారత రాజకీయాలు, భౌగోళిక రాజకీయాలపై, విదేశాంగ విధానంపై ట్విటర్‌లో తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా అతను మోదీ లక్షద్వీప్‌ పర్యటనతో మాల్దీవ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన ట్విట్ తీవ్ర దుమారాన్ని లేసింది .

Updated : 9 Jan 2024 5:21 PM IST
Tags:    
Next Story
Share it
Top