Home > జాతీయం > దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులు.. ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ..

దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులు.. ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ..

దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులు.. ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ..
X

రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఆస్తుల విలువ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అసలు పొలిటికల్ లీడర్స్ అంటేనే కోట్లు ఆస్తులుంటాయనే ప్రచారం ఉంది. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే మన దేశ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ మూడు రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కవని తేలింది. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ తెలిపింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా జాబితాను విడుదల చేసింది.

దేశంలో 4001 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా.. వారి ఆస్తి 54,545 కోట్లు అని ఏడీఆర్ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలైనా మిజోరాం, సిక్కిం, నాగాలాండ్ బడ్జెట్లను కలిపితే 49,103 కోట్లు మాత్రమే అని ఏడీఆర్ చెప్పింది. నాగాలాండ్ 2023-24 వార్షిక బడ్జెట్ రూ.23,086 కోట్లు కాగా, మిజోరం రూ.14,210 కోట్లు, సిక్కిం రూ.11,807 కోట్లేనని నివేదికలో ఉంది. మొత్తం ఎమ్మెల్యేల ఆస్తుల్లో సగానికి పైగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలవేనని వివరించింది.

ఈ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు మొత్తం రూ.32,032 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ.. సిక్కిం రూ.11,807 కోట్లు, మిజోరం రూ.14,210 కోట్లు రాష్ట్రాల బడ్జెట్‌ కన్నా ఎక్కువ అని తెలిపింది. మరోవైపు ఒక్క కర్ణాటక ఎమ్మెల్యేల ఆస్తుల విలువ మిజోరం, సిక్కిం రాష్ట్రాల వార్షిక బడ్జెట్ల కన్నా ఎక్కువ అని వెల్లడించింది. కర్ణాటకలో 223 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారి ఆస్తుల విలువ రూ. 14,359 కోట్లు ఉంది. ఇక వైసీపీకి 146మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారి ఆస్తుల విలువ 3379 కోట్లుగా ఉంది.



Updated : 2 Aug 2023 8:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top