Home > జాతీయం > Corruption India : భారత్‌లో పెరుగుతోన్న అవినీతి.. ఆ జాబితా విడుదల

Corruption India : భారత్‌లో పెరుగుతోన్న అవినీతి.. ఆ జాబితా విడుదల

Corruption India : భారత్‌లో పెరుగుతోన్న అవినీతి.. ఆ జాబితా విడుదల
X

ప్రపంచంలోనే అవినీతి దేశాల్లో భారత్ 93వ స్థానంలో నిలిచింది. అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో సోమాలియా 11 పాయింట్ల స్కోరుతో తొలి స్థానంలో నిలిచింది. అవినీతిరహిత దేశాల జాబితాలో డెన్మార్క్ మొదటిస్థానాన్ని పొందింది. తాజాగా ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 2023 ఏడాదికి సంబంధించి కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ జాబితాను విడుదల చేసింది. 180 దేశాలకు మధ్య జరిగిన ఈ సర్వేలో భారత్ 39 పాయింట్ల స్కోరుతో 93వ స్థానంలో నిలవడం విశేషం.

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థ. ఇది ప్రతి ఏడాది అవినీతి దేశాల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా 2023 ఏడాదికి సంబంధించి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 93వ ర్యాంకు పొందగా, పాకిస్తాన్, 133, శ్రీలంక 115 ర్యాంకుల్లో నిలిచాయి. ఇకపోతే కఠిన చట్టాలను అమలు చేసే చైనా దేశంలో అతినీతి దేశాల జాబితాలో 76వ స్థానంలో నిలిచింది.

అతినీతి దేశాల జాబితాలో సోమాలియా మొదటిస్థానంలో ఉండగా వెనిజులా 13, సిరియా 13, సౌత్ సూడాన్ 13, యెమెన్ 16 ర్యాంకుల్లో నిలిచాయి. ఈ దేశాలన్నీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండటంతో అవినీతి ఎక్కువగా జరుగుతోంది. ఉత్తర కొరియా కూడా అవినీతి దేశాల జాబితాలో 172వ స్థానాన్ని పొందింది. ప్రపంచబ్యాంక్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ప్రైవేట్ రిస్క్, కన్సల్టింగ్ కంపెనీల ద్వారా వివరాలు సేకరించి ఈ జాబితాను తయారు చేశారు.


Updated : 31 Jan 2024 6:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top