Home > జాతీయం > Justin Trudeau : ఉగ్రవాది హత్యపై కెనడా సంచలన ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన భారత్

Justin Trudeau : ఉగ్రవాది హత్యపై కెనడా సంచలన ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన భారత్

Justin Trudeau : ఉగ్రవాది హత్యపై కెనడా సంచలన ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన భారత్
X

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్పై సంచలన ఆరోపణలు చేశారు. కెనడాలో ఇటీవల జరిగిన ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని అన్నారు. కొంతమంది భారతీయ ఏజెంట్లకు ఈ హత్యతో సంబంధమున్నట్లు తమ వద్ద సమాచారముందని చెప్పారు. ఈ అంశంపై దేశీయ భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని ట్రూడో వెల్లడించారు. కెనడా పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం తమ సార్వభౌమాధికారానికి ఆమోదయోగ్యం కాదని ప్రకటించారు. ఈ అంశంపై సహకరించాల్సిందిగా భారత ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. గతవారం జరిగిన జీ20 సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు ట్రూడో చెప్పారు.





ఇదిలా ఉంటే ఖలిస్తానీ తీవ్రవాది హత్యలో ఇండియన్ ఏజెంట్లు ప్రమేయం ఉందన్న కారణంతో భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. ఆ అధికారి పేరు మాత్రం చెప్పలేదు. అయితే సదరు దౌత్యవేత్త కెనడాలోని భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్.. (రా) హెడ్ అని వెల్లడించారు.

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్ ఈ ఏడాది జూన్‌ 18లో సర్రేలోని గురుద్వారా వద్ద హత్యకు గురయ్యాడు. జలంధర్‌లో హిందూ పూజారిని చంపిన కేసులో ఖలిస్థానీ టైగర్‌ ఫోర్స్‌కు చెందిన నిజ్జర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతనిపై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది.

మరోవైపు కెనడా ప్రధాని ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ట్రూడో ప్రకటన తీవ్రవాదుల పట్ల సానుభూతి ప్రకటిస్తున్నట్లు ఉందని చెప్పింది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ప్రకటించింది. ఖలిస్థానీ తీవ్రవాదులు, అతివాదులకు ఆశ్రయం ఇచ్చిన కెనడా వారి నుంచి దృష్టి మరల్చేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తోందని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగిస్తే సహించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. ఈ విషయంలో కెనడా ప్రభుత్వం నిర్లిప్త వైఖరి ఆందోళన కలిగించే అంశమని ప్రకటించింది.

పంజాబ్ జలంధర్కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్థానీ టైగర్ ఫోర్స్, సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్ర సంస్థలకు నేతృత్వం వహించేవాడు. 1997లో కెనడాకు వెళ్లిపోయిన ఆయన అప్పటి నుంచి భారత మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.




Updated : 19 Sept 2023 9:41 AM IST
Tags:    
Next Story
Share it
Top