Home > జాతీయం > ఆకాశ వీధిలో అద్భుత ప్రదర్శన..10 వేల అడుగుల ఎత్తులో జీ20 ఫ్లాగ్

ఆకాశ వీధిలో అద్భుత ప్రదర్శన..10 వేల అడుగుల ఎత్తులో జీ20 ఫ్లాగ్

ఆకాశ వీధిలో అద్భుత ప్రదర్శన..10 వేల అడుగుల ఎత్తులో జీ20 ఫ్లాగ్
X

దేశ రాజధాని ఢిల్లీ నగరం G20 శిఖరాగ్ర సదస్సుకు వేదికైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల నేపథ్యంలో సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. G20 సమ్మిట్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఓ అద్భుతమైన ప్రదర్శనను అందించారు. భూమికి 10 వేల అడుగుల ఎత్తులో స్కైడైవింగ్ చేస్తూ G20 ఫ్లాగ్‎ను ఆకాశవీధిలో ఎగురవేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఢిల్లీ నగరం జీ20 శిఖరాగ్ర సదస్సుకు రెడీ అయ్యింది. ప్రపంచ దేశాల నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు కేంద్ర సర్కార్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. G20 సమ్మిట్ పాల్గొనేందుకు ఇప్పటికే పలు దేశాలకు చెందిన అధినేతలు దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ క్రమంలో భారత వైమానిక దళానికి చెందిన ఓ ఆఫీసర్ రాజస్థాన్‎లో స్కైడైవింగ్ చేస్తూ జీ20సమ్మిట్ జెండాను ఎగురవేశారు. జీ20సమ్మిట్ జెండా రెపరెపలాడుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘వసుధైవ కుటుంబం-ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే కాన్సెప్ట్‎తో సాహోసోపేతమైన విన్యాసానికి తెరలేపారు కమాండర్ గజానంద్ యాదవ్. భూమికి 10వేల అడుగుల ఎత్తులో చేసిన ఈ స్కైడైవింగ్ ప్రదర్శన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఫుటేజ్గత ఏడాదిదే అయినప్పటికీ తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది.


Updated : 8 Sept 2023 5:05 PM IST
Tags:    
Next Story
Share it
Top