Home > జాతీయం > భారత ఆర్మీని ముట్టడించిన 1500 మంది మహిళలు

భారత ఆర్మీని ముట్టడించిన 1500 మంది మహిళలు

భారత ఆర్మీని ముట్టడించిన 1500 మంది మహిళలు
X

జాతుల వైరంతో రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల కిందట హింసకు పాల్పడిన మిలిటెంట్లను విడిపించుకోవడానికి 1500 మందికిపై మహిళలు సైనిక స్థావరాన్ని చుట్టిముట్టి హల్‌చల్ చేశారు. మహిళలు కావడంతో మరో గత్యంతరం లేక సైనికులు వారి బలప్రయోగం చేయకుండా, మిలిటెంట్లను వదిలేశారు. తూర్పు ఇంఫాల్‌లోని ఇథం గ్రామంలో ఈ ఉదంతం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణకు ఎవరు అడ్డొచ్చిన వదిలే ప్రసక్తే లేదని, అయితే సాధ్యమైనంతవరకు బలప్రయోగం చేయకూడదన్నదే తమ ప్రాధాన్యమని అధికారులు చెప్పారు.

మైతేయ్ తెగ మిలిటెంట్ గ్రూపు కంగ్లీ యావోల్ కనా లుప్(‘కేవైకేఎల్‌’కు చెందిన 12 మంది మిలిటెంట్లను, భారీ స్థాయిలో ఆయుధాలను ఆర్మీ అదుపులోకి తీసుకోవడంతో ఈ గొడవ మొదలైంది. 2015లో ఆరవ డోగ్రా యూనిట్‌పై జరిగిన దాడితోపాటు పలు సంఘటనలో ఈ గ్రూప్ హస్తం ఉందని ఆర్మీ చెబుతోంది. అయితే ఆ మిలిటెంట్ల అరెస్ట్ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ఆడవాళ్లు శనివారం ఆర్మీ శిబిరంపై దండెత్తారు. తమవాళ్లను విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ బాధ్యతలు తమ నిర్వహిస్తున్నామని, అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి చెప్పుకోవాలని ఆర్మీ కోరింది. అయినా ఆడవాళ్లు పట్టినపట్టు విడవకుండా ఒక రోజుంతా అక్కడే తిష్టవేశారు. సైన్యం వారిపై బలప్రయోగం చేయడం ఇష్టం లేని మిలిటెంట్లను వదిలేసింది. ప్రాణనష్టాన్ని నివారించడానికే మానవతా దృక్పథంతో విడుదల చేశామని తెలిపింది.




Updated : 25 Jun 2023 10:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top