Home > జాతీయం > Balsara : న్యూయార్క్‌ కోర్టు జడ్జిగా ఇండియన్

Balsara : న్యూయార్క్‌ కోర్టు జడ్జిగా ఇండియన్

Balsara : న్యూయార్క్‌ కోర్టు జడ్జిగా ఇండియన్
X

అమెరికా ప్రభుత్వంలో ఉన్నత పదవులు పొందుతున్న ఇండియన్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా భారత సంతతికి చెందిన సంకేత్ జయేశ్ బల్సారా (46)ను న్యూయార్క్‌లోని అమెరికా తూర్పు జిల్లా కోర్టు జడ్జిగా నియమించింది. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం బల్సారాను జడ్జిగా నియమిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. బల్సారా ఇదే కోర్టు మేజిస్ట్రేటుగా 2017 నుంచి పనిచేస్తున్నారు. ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి దక్షిణాసియా సంతతి వ్యక్తి ఆయనే కావడం విశేషం. అయితే ఇప్పుడు అక్కడే న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది.

బల్సారా తల్లిదండ్రులు భారత్‌, కెన్యాల నుంచి 50 ఏళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చారు. బల్సారా సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ వ్యవహారాల్లో ప్రావీణ్యం పొందిన వాడు. అంతేగాక ఆయన తండ్రి న్యూయార్క్‌ సిటీలో ఇంజినీర్ గా వర్క్ చేస్తుండగా తల్లి నర్సుగా చేస్తున్నారు.




Updated : 10 Feb 2024 3:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top