గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక.. వెంటనే..
X
సైబర్ దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గూగుల్ క్రోమ్ (Google Chrome) యూజర్లను అప్రమత్తం చేసింది. కంప్యూటర్లలో క్రోమ్ బ్రౌజర్ వాడుతుంటే తక్షణమే అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. లేకపోతే మాల్‌వేర్ దాడులు జరగొచ్చని, డేటాను దొంగించే అవకాశముందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) హెచ్చరించింది. క్రోమ్ బ్రౌజర్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి వల్ల సైబర్ దాడులు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని వెర్షన్లకు ఫిషింగ్, డాటా దాడులు, మాల్‌వేర్ ఇన్‌ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉందని తెలిపింది. ‘‘ప్రాంప్ట్స్, వెబ్ పేమెంట్స్ ఏపీఐ, వీడియో, వెబ్ ఆర్‌టీసీ ఫీచర్లకు ముప్పు కలగొచ్చు. అవాంఛనీయ పైట్లను చూస్తే హ్యాకర్లు మీ డేటాను తస్కరించే అవకాశం ఉంది. లైనెక్స్, మ్యాక్ కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ వెర్షన్ 115. 0.5790.170 వాడుతున్న వారు, విండోస్‌లో 115.0.5790.170/.171 వెర్షన్ ఉపయోగిస్తున్నవారు వెంటనే తమ బ్రౌజర్లను అప్‌డేట్ చేసుకోవాలి’’ అని సూచించింది.
గూగుల్ క్రోమ్ అప్ డేట్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
• గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి కుడివైపు పైమూలలోని మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి.
• స్క్రోల్ చేసి సెట్టింగ్స్ పేజ్‌లో ఎడమవైపుకు వెళ్తే జాబితా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే బ్రౌజర్ అప్‌డేట్ అయిందో లేదో కనిపిస్తుంది
• అప్‌డేట్ కాకుంటే బ్రౌజర్‌ను రీలాంచ్ చేసి అప్‌డేట్ చేయాలి. బ్రౌజర్ ఆటోమేటిగ్గా అప్‌డేట్ అయితే ‘క్రోమ్ ఈజ్ అప్ టూ డేట్’ అని కనిపిస్తుంది.
• మీ ఆన్‌లైన్ ఖాతాలకు పటిష్టమైన పాస్‌వర్డ్‌లు క్రియేట్ చేసుకోండి.
• మాల్‌వేర్లు దాడి చేయకుండా ఫైర్‌వాల్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ వాడుకోవాలి.