Home > జాతీయం > పెరుగుతున్న బియ్యం ధరలు.. కేంద్రం సంచలన నిర్ణయం..

పెరుగుతున్న బియ్యం ధరలు.. కేంద్రం సంచలన నిర్ణయం..

పెరుగుతున్న బియ్యం ధరలు.. కేంద్రం సంచలన నిర్ణయం..
X

దేశం అకాల వర్షాలు, అనావృష్టి కారణంగా వరి దిగుబడుగులు తగ్గి, బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ధరలు తగ్గించి, నిల్వలను పెంచడానికి ఎగుమతులపై నిషేధం విధించింది. బాస్మతియేతర రకాల బియ్యం ఎగుమతిపై నిషేధిం విధిస్తున్నట్లు వాణిజ్య శాఖ విభానికి చెందిన డైరెక్టరరేట్ ఆఫ్ జనరల్ ఫారిన్ ట్రేడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది. సెమీ మిల్డ్ రైస్, నాన్ పాలిష్, గ్లేజ్డ్ రకాలను ఎగుమతి చేయకూడదు’’ అని వెల్లడించింది. ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పేద దేశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రపంచంలో బియ్యం ఎగుమతుల్లో మనదేశానికి అగ్రస్థానం. 40 ఎగుమతులు మన దేశం నుంచే సాగుతున్నాయి. గత ఏడాది ప్రతికూల వాతవరణ పరిస్థితుల వల్ల దేశంలో ధాన్యోత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగాయి.





ఎగుమతులపై నిషేధం వల్ల బంగ్లాదేశ్, నేపాల్ ఇబ్బంది పడుతున్నాయి. భారత్ నుంచి ఆ దేశాలకే ఎక్కువ ఎగుమతులు సాగుతున్నాయి. దేశంలో బియ్యం నిల్వలను, పెంచి ధరలను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా దేశమంతం బాస్మతీయేతర మేలురకం బియ్యం ధరలు ఇటీవల విపరీతంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 25 కేజీల ప్యాకెట్ల స్థానంలో 26 కేజీల ప్యాకెట్లు తీసుకొచ్చి భారతీగా ధరలు పెంచారు. ప్యాకెట్‌పై ధర గత ఆరు నెలల్లోనే రూ. 200 వరకు పెరిగింది. రేషన్ షాపుల్లో ఇస్తున్న నాసిరకం బియ్యాన్ని అల్పాహారాలకు, వేరే ఉత్పత్తుల తయారీకి వాడుతుండడంతో నాణ్యమైన బియ్యం ధరలు కొండెక్కుతున్నాయి.


Updated : 21 July 2023 5:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top