Home > జాతీయం > ALERT: యాపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం.. యూజర్లకు కేంద్రం అలర్ట్

ALERT: యాపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం.. యూజర్లకు కేంద్రం అలర్ట్

ALERT: యాపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం.. యూజర్లకు కేంద్రం అలర్ట్
X

యాపిల్‌ యూజర్లకు కేంద్రం సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. ఐఫోన్‌, ఐపాడ్‌, యాపిల్‌ వాచ్‌, మ్యాక్‌ బుక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ తో పాటు సఫారీ బ్రౌజర్‌లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. ఇండియన్ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. ఈ లోపం వల్ల హ్యాకర్లు యాపిల్‌ ప్రొడక్ట్స్ యూజర్ల డేటా సేకరించే అవకాశముందని హెచ్చరించింది. మాల్‌వేర్‌ లింక్స్‌, మెసేజ్‌లను పంపి డేటా తస్కరించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

మ్యాక్‌ ఓఎస్‌ వెర్షన్ - 12.7, 13.6, వాచ్‌ ఓఎస్‌ - 9.6.3, 10.0.1, ఐఓఎస్‌ వెర్షన్‌ - 17.0.1, ఐపాడ్ ఓఎస్‌ వెర్షన్ - 17.0.1 ఓఎస్‌లలో లోపాలు ఉన్నట్లు సెర్ట్‌ ఇన్‌ చెప్పింది. వీటితో పాటు సఫారీ 16.6.1 వెర్షన్‌లో కూడా లోపం ఉన్నట్లు గుర్తించింది. యూజర్లు డేటా ప్రొటెక్ట్ చేసుకునేందుకు డివైజ్‌లలో లేటెస్ట్‌ వెర్షన్ ఓఎస్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ ఐఓఎస్‌ 17.0.1 సైతం సెర్ట్‌ ఇన్‌ చెప్పిన లిస్టులో ఉండటంతో యాపిల్‌ కంపెనీ కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ను త్వరలో విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Updated : 24 Sept 2023 6:43 PM IST
Tags:    
Next Story
Share it
Top