Home > జాతీయం > ల్యాప్‌టాప్, కంప్యూటర్ల దిగుమతిపై కేంద్రం కొత్త ఆంక్షలు

ల్యాప్‌టాప్, కంప్యూటర్ల దిగుమతిపై కేంద్రం కొత్త ఆంక్షలు

ల్యాప్‌టాప్, కంప్యూటర్ల దిగుమతిపై కేంద్రం కొత్త ఆంక్షలు
X

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువలపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సరైన అనుమతులు ఉంటేనే ఫారెన్ కంట్రీస్ నుంచి ల్యాప్‌టాప్‌లు , పర్సనల్ కంప్యూటర్లు , ట్యాబ్లెట్లను ఇంపోర్ట్ చేసుకోవాలనే కొన్ని వినహాయింపులను ఇచ్చింది. కొత్త రూల్‎ను తీసుకువస్తున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. అదే విధంగా చట్టపరంగా అన్ని అనుమతులు ఉన్నవారికి.. పరిమిత సంఖ్యలోనే ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతి చేసుకునే పర్మీషన్ ఇస్తామని చెప్పింది. తాజా నిర్ణయంతో దేశీయంగా కంప్యూటర్ల తయారీకి ఊతమందుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

బ్యాగేజీ రూల్స్ కింద ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంపోర్ట్ చేసుకునే వారిపై ఈ ఆంక్షలు వర్తించవని మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈకామర్స్ లో కొని కొరియర్ ద్వారా ఇంపోర్ట్ చేసుకునే ప్రాడక్ట్స్‎కు కూడా ఎలాంటి పరిమితులు ఉండవని వివరించింది. హెచ్ఎస్ఎన్ 8741 కింద దిగుమతి చేసుకునే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపింది. అలాగే ఒకసారి ఇంపోర్ట్ అయిన ప్రాడక్ట్ మళ్లీ అమ్మకూడదని, అదే విధంగా పని పూర్తైన తరువాత ఎక్స్‎పోర్ట్ చేయడమో లేదా ధ్వంసం చేయాలని మంత్రిత్వశాఖ సూచించింది. ఈ తాజా ఆంక్షలతో దేశీయంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌, పర్సనల్‌ కంప్యూటర్ల తయారీ కంపెనీలకు మరింత ఊతం లభించనుంది.





Updated : 3 Aug 2023 5:07 PM IST
Tags:    
Next Story
Share it
Top