Home > జాతీయం > ఉత్తర, మధ్య అరేబియా సముద్రం విషయంలో.. ఇండియన్ నేవీ కీలక నిర్ణయం

ఉత్తర, మధ్య అరేబియా సముద్రం విషయంలో.. ఇండియన్ నేవీ కీలక నిర్ణయం

ఉత్తర, మధ్య అరేబియా సముద్రం విషయంలో.. ఇండియన్ నేవీ కీలక నిర్ణయం
X

ఇండియన్ నేవీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర, మధ్య అరేబియా సముద్రంలో నిఘాను పెంచింది. ఇజ్రాయెల్- హమాస్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో.. ఈ మధ్య ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. హౌతీ మిలిటెంట్లు ప్రతీ నౌకపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఇండియన్ నేవీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర, మధ్య అరేబియా సముద్రాల్లో భద్రతను పెంచింది.

భద్రతకోసం డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లను మోహరించింది. వీటితో పాటు మానవ రహిత వైమానిక దళాలు, సముద్రంలో గస్తీ విమానాలను ఏర్పాటుచేసింది. అంతేకాకుండా హిందూ మహా సముద్రంలో భద్రతను సమీక్షించేందుకు కోస్ట్ గార్డ్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధం అయింది. కాగా ఇటీవల భారత్ కు సంబంధించిన వాణిజ్య నౌకపై దాడి జరిగిన విషయం తెలిసిందే. భారత తీరానికి 700 నాటికల్ మైళ్ల దూరంలో.. ఎంపీ రుయెన్, పోర్ బందర్ పోర్ట్ కు దాదాపు 220 నాటికల్ మైళ్ల దూరంలో దాడి జరిగింది. ఈ దాడిలో ఎంవీ కెమ్ ప్లూటో నౌక తీవ్రంగా ధ్వసం అయింది.

Updated : 31 Dec 2023 5:37 PM IST
Tags:    
Next Story
Share it
Top