Home > జాతీయం > Indian Navy : గుజరాత్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. అమిత్ షా అభినందనలు

Indian Navy : గుజరాత్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. అమిత్ షా అభినందనలు

Indian Navy : గుజరాత్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. అమిత్ షా అభినందనలు
X

అరేబియా సముద్రంలో డ్రగ్స్ రాకెట్కు ఇండియన్ నేవి చెక్ పెట్టింది. నేవీ-ఎన్సీబీ చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో 3,300కేజీల డ్రగ్స్ పట్టుకున్నారు. గుజరాత్లోని పోర్ బందర్ తీరంలో ఓ నౌకలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. సముద్రంలో ఓ బోటు అనుమానస్పదంగా కన్పించడంతో అధికారులు దానిని చుట్టముట్టారు. బోటులో తనిఖీలు చేయగా..అందులో పెద్దమొత్తంలో డ్రగ్స్ దొరికాయి.





బోటులో 3089కేజీల చరాస్, 158 కిలోల మెథ్, 25కిలోల మార్ఫిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితులంతా పాకిస్థాన్కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ రూ.1300 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఆపరేషన్పై హోంమంత్రి అమిత్ షా స్పందించారు. నేవీ, ఎన్సీబీని ప్రత్యేకంగా అభినందించారు. డ్రగ్స్ ఫ్రీ ఇండియా విజన్ను సమర్ధవంతంగా అమలుచేస్తున్నందుకు కంగ్రాట్స్ చెప్పారు.






Updated : 28 Feb 2024 2:18 PM IST
Tags:    
Next Story
Share it
Top