Home > జాతీయం > మీకు పనికిరానివి తెచ్చివ్వండి...పెట్రోల్ ఫ్రీగా పట్టుకెళ్ళండి

మీకు పనికిరానివి తెచ్చివ్వండి...పెట్రోల్ ఫ్రీగా పట్టుకెళ్ళండి

మీకు పనికిరానివి తెచ్చివ్వండి...పెట్రోల్ ఫ్రీగా పట్టుకెళ్ళండి
X

దేశంలో చెత్త చాలా పెరిగిపోతోంది. అందులోనూ మన దేశంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. డస్ట్ బిన్ లో వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే ఇండియన్ ఆయిల్ కొత్తగా ఆలోచించింది. పనికిరాని చెత్త, ప్లాసిక్, కాగితాలు ఏమైనా సరే తీసుకొచ్చి మాకివ్వండి...పెట్రోల్ ఫ్రీగా తీసుకెళ్ళండి అని చెబుతోంది.

పర్యావరణాన్ని కాపాడేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. ప్లాస్టిక్ వేస్ట్ తీసుకుని పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నారు. దీంతో వేలాది మంది పనికిరాని ప్లాస్టిక్ తీసుకువచ్చి, వారికి కావాల్సిన పెట్రోల్ నింపుకుని వెళుతున్నారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లోని లెమన్ ట్రీ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ బంకులో, ఐకియా స్టోర్ దగ్గరలో ఉన్న బంకులో, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 లో, సైబర్ ఫిల్లింగ్ స్టేషన్ మియాపూర్ దగ్గర, బేగం పేట్ రోడ్ లో, ప్రకాశ్ నగర్ వద్ద ఉన్న బంకుల్లో ఇండియన్ ఆయిల్ ఈ విధానం ప్రవేశ పెట్టింది.కేవలం పనికిరాని ప్లాస్టిక్ మాత్రమే కాదు, అట్టపెట్టెలు, చిత్తు కాగితాలు... ఇలా మీ దగ్గర ఉన్నది ఏదైనా గాని, పెట్రోల్ బంకు తీసుకొచ్చి వారికి అప్పగించి, ఉచితంగా పెట్రోల్ తీసుకుని వెళ్లవచ్చు.ప్లాస్టిక్ రీసైకిల్ చేసిన వాళ్ళకి ఉచితంగా ఒక లీటర్ పెట్రోల్ ఇస్తున్నారు.

ఈ ఆఫర్ పెట్టాక ఇండియన్ ఆయిల్ బంకుల దగ్గర జనాలు క్యూలు కడుతున్నారు. పనికిరాని వేస్ట్ ఇచ్చేసి పెట్రోల్ తీసుకుని వెళుతున్నారు. కొంతమంది కార్లలో కూడా చెత్తను తీసుకుని వస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కి వచ్చిన ఈ ఐడియాను అందరూ మెచ్చుకుంటున్నారు. దీనివల్ల ఉభయతారకంగా ఉండడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకి కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు.

వేస్ట్ నుంచి దేశాన్ని రక్షించడానికే ఈపని చేస్తున్నామని ఇండియన్ ఆయిల్ చెబుతోంది. వ్యర్ధాలను సేకరించి వాటి నుంచి వస్తువులను తయారు చేసే వాళ్ళకు దాన్ని ఇస్తామని అంటోంది. మొట్టమొదటగా ఈ విన్నూత్న ప్రయోగం హైదరాబాద్ లోనే మొదలైంది. ఇది బాగా వర్కౌట్ అయితే మిగతా నగరాల్లోనూ అమలు చేస్తామని చెబుతున్నారు.


Updated : 22 July 2023 6:13 PM IST
Tags:    
Next Story
Share it
Top