Home > జాతీయం > పోస్టల్ శాఖ కొత్త సర్వీసులు.. ఇకపై హైదరాబాద్లో

పోస్టల్ శాఖ కొత్త సర్వీసులు.. ఇకపై హైదరాబాద్లో

పోస్టల్ శాఖ కొత్త సర్వీసులు.. ఇకపై హైదరాబాద్లో
X

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్ లో క్లిక్ ఎన్ బుక్ అనే పేరుతో కొత్తగా ఆన్ లైన్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా కస్టమర్ లు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్స్, పార్సెల్ లను ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు. కాగా ప్రస్తుతం ఈ సర్వీస్ హైదరాబాద్ లోని 107 పిన్ కోడ్ లకు మాత్రమే అందుబాటులో ఉంది. లేటెస్ట్ టెక్నాలజీతో కస్టమర్ ఫ్రెండ్లీ, హైటెక్ సర్వీసులను అందించడానికి పోస్టల్ డిపార్ట్ మెంట్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ సర్వీసును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సర్వీస్.. ఇప్పుడు హైదరాబాద్ కు కూడా తీసుకొచ్చారు. ఈ సర్వీస్ తో కస్టమర్ పోస్టాఫీసుకు వెళ్లకుండానే గరిష్టంగా 5 కిలోల వరకు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్స్, పార్సెల్ లను పంపించొచ్చు.

కస్టమర్లు ఈ సర్వీస్ ను పొందాలంటే ముందుగా పోస్టల్ డిపార్ట్ మెంట్ అధికారిక వెబ్‌సైట్ www.indiapost.gov.in లో అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొదట కస్టమర్లు రూ.500 వరకు బుకింగ్ చార్జీలు చెల్లిస్తే.. మీ పోస్టులను ఉచితంగా పికప్ చేసుకుంటారు. ఒకవేళ మీరు చెల్లించిన బుకింగ్ చార్జీలు రూ.500 కంటే తక్కువగా ఉంటే.. రూ.50 అదనంగా పికప్ చార్జీలు వసూలు చేస్తారు. ఉదయం 9:30 గంటల్లోపు ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకుంటే.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు పికప్ చేసుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బుక్ చేసుకుంటే.. మరుసటి రోజు పికప్ చేసుకుంటారు.


Updated : 13 Dec 2023 9:07 PM IST
Tags:    
Next Story
Share it
Top