Home > జాతీయం > ఇండియా ఫస్ట్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై కీలక అప్‌డేట్.. వీడియో వైరల్

ఇండియా ఫస్ట్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై కీలక అప్‌డేట్.. వీడియో వైరల్

ఇండియా ఫస్ట్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై కీలక అప్‌డేట్.. వీడియో వైరల్
X

భారత్ చేపట్టిన బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అహ్మదాబాద్‌-ముంబై మధ్య నడపనున్న తొలి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో ప్రధాన ఘట్టం పూర్తయింది. 250 కి.మీ.కిపైగా పిల్లర్లు, 103 కి.మీకిపైగా ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్( పట్టాలు) నిర్మాణాలు పూర్తయ్యాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ విషయం వెల్లడిస్తూ ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ మార్గంలో వంద కి.మీ పట్టాలు, బాక్స్‌ గిర్డర్లు, సెగ్మెంటల్‌ గిర్డర్ల నిర్మా పూర్తయిందన్నారు. 508.17 కి.మీ. సాగే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అహ్మదాబాద్ నుంచి ముంబైకి 2.58 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి ఆరు గంటల సమయం పడుతోంది. తొలి బుల్లెట్ రైలును 2026నాటికి పట్టాలెక్కించనున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ. 1.08 లక్షల కోట్లు.

గంటకు 320 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్ల మార్గం అత్యంత పకడ్బందీగా ఉంటుంది. నేషనల్ హై-స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. గుజరాత్‌లో వల్సాద్‌, నవ్‌సారి జిల్లాల్లోని ఆరు నదులపై వంతెనల నిర్మాణం పూర్తయిందని, తొలి గిర్డర్‌ నిర్మాణాన్ని 2021 నవంబర్‌లో ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేశామని సంస్థ తెలిపింది. ‘‘ఫుల్‌ స్పాన్‌ లాంచింగ్ విధానంలో 100 కి.మీ వయాడక్ట్‌ ను ఏడాది వ్యవధిలోనే నిర్మించాం. సూరత్‌లో ట్రాక్‌ బెడ్‌ను జపనీస్‌ షింకన్‌సేన్‌ ట్రాక్‌ విధానంలో నిర్మిస్తున్నాం. మనదేశంలో ఈ విధానాన్ని అనుసరించడం ఇదే తొలిసారి. ఈ రైలు ప్రాజెక్ట్‌లో వివిధ నదులపై, వాగులపై 28 స్టీలు వంతెనలు రానున్నాయి’’ అని వెల్లడించింది.



Updated : 24 Nov 2023 8:42 PM IST
Tags:    
Next Story
Share it
Top