Home > జాతీయం > indian railway news : రైల్వే ప్రయాణికులకు శుభవార్త

indian railway news : రైల్వే ప్రయాణికులకు శుభవార్త

indian railway news : రైల్వే ప్రయాణికులకు శుభవార్త
X

జనరల్ బోగీలో రైలు ప్రయాణం గురించి చెప్పక్కర్లేదు. కిక్కిరిసిన రైలులో సుదూర ప్రయాణమంటే నరకం చూడాల్సిందే. పిల్లలు, లగేజీతో ఇలాంటి ప్రయాణం అంటే మామూలు విషయం కాదు. చాలా సమస్యలు ఎదురవుతాయి. సరైన ఆహారం, త్రాగు నీరు కూడా దొరకదు. ఎక్కకువగా వలస కూలీలు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక రాష్ట్రం నుంచి మరొ రాష్ట్రానికి వీరు ప్రయాణించినప్పుడు అష్టకష్టాలను పడతారు. వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేకరైళ్లను నడుపుతోంది. అయితే అవి ఎప్పుడెప్పుడు తిరుగుతాయో కొందరికి తెలియదు. అది కూడా కొన్ని రోజలు మాత్రమ ఈ రైళ్లు కేటాయిస్తారు.

తాజాగా రైల్లే మరో శుభవార్త అందించింది. సంవత్సరం పొడవునా ప్రయాణించే వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లు నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువమంది వలస పోతున్నారు? ఏ రాష్ట్రాలకు వెళుతున్నారు? ఎప్పుడు తిరిగివస్తున్నారు? తదితర విషయాలపై సర్వే చేసిన రైల్వే వలక కార్మికలు ఇబ్బందులను గుర్తించింది. ఈ మేరకు వారి కోసం కొత్త రైళ్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. త్వరలోనే ఇవి పట్టాలెక్కనున్నాయి.





కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ప్రత్యేక రైళ్ల ల్లో స్లీపర్, జనరల్ బోగీలే ఉండనున్నాయి. మొత్తం 22 నుంచి 26 కోచ్ లు ఉంటాయి. ఈ రైళ్ళలో ఏసీ బోగీలు ఉండవు. యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అస్సాం, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు వసల కార్మికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రైళ్లను శాశ్వత ప్రతిపాదికన నడపనున్నారు. ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజువారీ రైళ్లపై రద్దీ ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన విడుదల కానుంది.


Updated : 19 Aug 2023 6:23 PM IST
Tags:    
Next Story
Share it
Top