Home > జాతీయం > రంగు మారిన వందే భారత్

రంగు మారిన వందే భారత్

రంగు మారిన వందే భారత్
X

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించాలనే ఉద్దేశ్యంతో అత్యాధునిక రైళ్లను భారతీయ రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రజలకు అందుబాటులకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ప్రజలను వేగవంతంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే తాజాగా వందేభారత్ రైళ్లలో రైల్వే శాఖ కొన్ని మార్పులను చేపడుతోంది. ఇన్నాళ్లు నీలి రంగులో ఉన్న వందేభారత్ రైలు రంగును మార్చుతోంది. ఆరెంజ్ కలర్ వందే భారత్ రైళ్లను తయారు చేయిస్తోంది రైల్వే శాఖ. తొలిసారిగా ఈ ఆరెంజ్ కలర్ వందే భారత్ రైలు సక్సెస్ ఫుల్‎గా పట్టాలపై పరుగులు తీసింది.

ఈ మధ్యనే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో నారింజ రంగులో ఉన్న వందే భారత్ రైలును చూసి, ఆ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. అవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నేషనల్ ఫ్లాగ్‎లో ఉన్న కాషాయరంగు స్ఫూర్తిగా వీటిని తయారుచేశారు. ఈ కొత్త రంగులో ఉన్న రైలు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి పాడీ రైల్వే ఫ్లైఓవర్ రూట్‌లో ప్రయాణించింది.

రంగు మాత్రమే కాదు వందేభారత్ బోగీలను మెరుగైన ఫీచర్లతో అప్‎గ్రేడ్ చేశారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని మరుగుదొడ్లు, మెరుగైన లైటింగ్, వాష్ బేసిన్ బౌల్స్, మెరుగైన టాయిలెట్ హ్యాండిల్స్, ఎమెర్జెన్సీ కోసం హ్యామర్ బాక్స్, టాక్‌బ్యాక్ యూనిట్, ఫైర్ డిటెక్షన్ లాంటి ఫీచర్స్‌ ను అందించింది. కొత్తవాటిలోనే కాదు ప్రస్తుతం రన్నింగ్‏లో ఉన్న వందే భారత్ రైళ్లల్లోనూ ఫీచర్లను అప్ గ్రేడ్ చేసి మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించారు.

Updated : 21 Aug 2023 8:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top